- Home
- Entertainment
- శ్రీదేవి బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఒప్పుకుంటా.. కానీ నాకు కూడా ఒక చరిత్ర ఉంది, నయనతార షాకింగ్ కామెంట్స్
శ్రీదేవి బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఒప్పుకుంటా.. కానీ నాకు కూడా ఒక చరిత్ర ఉంది, నయనతార షాకింగ్ కామెంట్స్
లెజెండ్రీ నటి శ్రీదేవిపై నయనతార చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

నయనతార ఖాతాలో మరో హిట్
సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ఖాతాలో మరో హిట్ సినిమా చేరింది. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీ సూపర్ హిట్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నయనతార ప్రమోషన్స్ కి హాజరుకారు. ఆ కంప్లైంట్ ముందు నుంచి నయనతారపై ఉంది. కానీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఆమె 2 ప్రమోషనల్ వీడియోలు చేశారు.
చిరంజీవి సినిమా కోసం నయనతార ప్రమోషన్స్
ఈ విషయాన్ని అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూలలో, ప్రీరిలీజ్ ఈవెంట్ లో గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి నయనతార పేరు ట్రెండ్ అవుతోంది. నయనతారకి సంబంధించిన విశేషాలు వైరల్ అవుతున్నాయి. నయనతార ప్రస్తుతం సౌత్ లో లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు.
శ్రీదేవిపై కామెంట్స్
సౌత్ లో మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ అంటే శ్రీదేవి పేరే చెప్పాలి. శ్రీదేవి గురించి ఓ ఇంటర్వ్యూలో నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మేడమ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆమె ఒక లెజెండ్. ఆమె ముందు నేను అసలు సరిపోను. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, నటన అద్భుతం. నేనే కాదు ఇప్పుడున్న నటీమణులు ఎవరూ ఆమె అంత అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న వాళ్ళు లేరు.
నాకంటూ ఒక చరిత్ర ఉంది
కానీ నాకు కూడా ఒక చరిత్ర ఉంది. నాకంటూ చెప్పుకోవడానికి జీవిత కథ ఉంది. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒడిదుడుకులు తట్టుకున్నాను. ఎన్నో బాధలు అనుభవించా. చివరికి ఈ స్థాయికి చేరుకున్నా అని నయనతార అన్నారు. అందుకే తన జీవితంపై డాక్యుమెంటరీ చిత్రం తీసినట్లు నయన్ పేర్కొంది.
అగ్ర హీరోలతో సినిమాలు
నయనతార తెలుగులో సీనియర్ హీరోలందరితో నటించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అదే విధంగా రవితేజ, ఎన్టీఆర్, ప్రభాస్ లతో కూడా ఆమె నటించారు.

