కృతి సనన్ కొత్త ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవుతారు.. అయ్యో ఎంత పేదరాలు !
కృతి సనన్ బాంద్రాలోని సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ కూడా ఉంటారు. దీని కోసం ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటో ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బాలీవుడ్ నటి కృతి సనన్ ముంబైలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవలే ఆమె కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యింది. మరి ఈ కొత్త ఇంటి అద్దె తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
ముంబైలో కృతి సనన్ తన ఇల్లు మార్చిందని ఒక `పేపరాజీ` పేజీ ద్వారా తెలిసింది. దీంతో ఎందుకు కృతి సనన్ ఇళ్లు మారిందనేది ఆసక్తికరంగా మారింది.
కృతి ఇంతకు ముందు ఓషివారాలోని అట్లాంటిస్ అనే బిల్డింగ్‌లో ఉండేదని చెబుతున్నారు. చాలా కాలంగా ఆమె అక్కడే ఉంటుందట. కానీ సడెన్‌గా ఇప్పుడు షిఫ్ట్ అయ్యింది. సెలబ్రిటీలు ఉండే ప్లేస్‌కి ఆమె ఇళ్లు మారినట్టు తెలుస్తుంది.
ఇప్పుడు కృతి తన అడ్రస్ మార్చేసింది. బాంద్రాలోని ఫేమస్ బిల్డింగ్ సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయింది. అయితే ఈ కొత్త ఇళ్లు రెంట్ వివరాలు తెలిస్తే మతిపోతుంది. ఇంత కాస్ట్లీ ఇంట్లోకి కృతి ఎందుకు షిఫ్ట్ అయినట్టు అనేది ఆసక్తికరంగా మారింది.
మన ఇండియన్ క్రికెటర్స్ కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వారి ఇళ్లకి సమీపంలోనే ఇప్పుడు కొత్తగా మారిన కృతి సనన్ ఇళ్లు కూడా ఉంటుందని సమాచారం.
కృతి ఈ ఫ్లాట్‌ను లీజుకు తీసుకుందని అంటున్నారు. దీని కోసం ఆమె నెలకు 16-17 లక్షలు అద్దె చెల్లిస్తుంది. పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచ్‌లర్‌గానే ఉంటున్న కృతి ఇంత కాస్ట్లీ ఫ్లాట్‌కి మారడం ఆశ్చర్యపరుస్తుంది. పైగా ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటే మైండ్ బ్లాక్ చేస్తుంది.
కృతి ఫ్లాట్ అద్దె గురించి తెలుసుకున్న ఇంటర్నెట్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టయిల్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
ఒక ఇంటర్నెట్ యూజర్ సరదాగా కామెంట్ చేస్తూ "పాపం ఎంత పేదరాలు. అద్దెకు ఉంటోంది" అని రాశారు.ఖరీదైన రెంటర్ అని, వామ్మో రెంట్లకి ఇన్ని లక్షలు తగలబెడుతున్నారా? అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.
కృతి సనన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'దో పత్తి'లో కనిపించింది. అంతకు ముందు ప్రభాస్ సరసన `ఆదిపురుష్` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఆడలేదు. అయితే ఇటీవల కృతి లవ్‌లో పడిందట. నటుడు కబీర్ బహియాతో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే.
read more: ముక్కుతో టమాటాలు కోసిన ప్రభాస్, మోహన్‌బాబు కంటే ఆయనదే షార్ప్.. వీడియో వైరల్