MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రకుల్‌ ని ఫాలో అవుతున్న మహేష్‌ హీరోయిన్‌.. కొత్త బిజినెస్‌ స్టార్ట్.. వర్కౌట్స్ లో కేకపెట్టిస్తుందేమో?

రకుల్‌ ని ఫాలో అవుతున్న మహేష్‌ హీరోయిన్‌.. కొత్త బిజినెస్‌ స్టార్ట్.. వర్కౌట్స్ లో కేకపెట్టిస్తుందేమో?

హీరోయిన్లు నటిగా రాణించడంతోపాటు వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కాజల్‌, తమన్నా, రకుల్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్‌ హీరోయిన్‌ కూడా కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 25 2022, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మహేష్‌బాబు నటించిన `వన్‌ నేనొక్కడినే` తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్‌(Kriti Sanon). ఇప్పుడు `ఆదిపురుష్‌`(Adipurush) లో సీతగా కనిపించబోతున్న ఈ పొడుగుకాళ్ల సుందరి కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసినట్టు చెప్పింది కృతి సనన్‌.
 

26

ఆమె లేటెస్ట్ గా జిమ్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసింది. `ది ట్రైబ్‌`(The Tribe) పేరుతో జిమ్‌ సెంటర్‌నిప్రారంభించినట్టు కృతి సనన్‌ సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఎనిమిదేళళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో తన జర్నీ స్టార్ట్ చేశానని, సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్‌ టాలెంటెడ్‌ కో ఫౌండర్లు అనుస్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్ లతో కలిసి వ్యాపారవేత్తగా `ది ట్రైబ్‌`ని లాంచ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది` అని పేర్కొంది కృతి సనన్‌. 
 

36

ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది కృతి. ఇందులో వర్కౌట్‌ డ్రెస్‌లో, సూపర్‌ ఫ్రెష్‌గా ఉన్న వీరి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు వీరంతా ఫిట్‌గా ఉండటం విశేషం.  అయితే ఈ సెంటర్‌కి సంబంధించిన యాప్‌ని వచ్చే ఏడాది లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పింది కృతి సనన్‌. 

46

ఇదిలా ఉంటే ఈ విషయంలో కృతి.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని ఫాలో అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌లో యోగా సెంటర్లని ఏర్పాటు చేసింది. `ఎఫ్‌ 45`పేరుతో ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్‌ సెంటర్లు విజయవంతంగా రన్‌ అవుతున్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆమె దారిలోనే కృతి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. 
 

56

ఇదిలా ఉంటే కృతి సనన్‌ ఏడేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. మహేష్‌తో 2014లో `వన్‌ నేనొక్కడినే`లో నటించిన కృతి ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2015లో నాగచైతన్యతో `దోచేయ్‌` సినిమా చేసింది. ఇది కూడా పరాజయం చెందడంతో కృతి తెలుగుకి దూరమైంది. ఇప్పుడు `ఆదిపురుష్‌`లో సీత పాత్రలో నటిస్తుంది.రాముడిగా ప్రభాస్‌ చేస్తుండగా, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తుండటం విశేషం. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. 
 

66

`గతేడాది `మిమి` సినిమాతో ప్రశంసలందుకున్న కృతి సనన్‌ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె `షేహజాద్‌`, `భేడియా`, `గణపత్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved