MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Krithi Shetty about Lipkiss: క్యూట్‌ అందాలతో కిల్‌ చేస్తున్న ఉప్పెన భామ.. సిగరేట్‌ తాగడం ప్రాక్టీస్‌ చేశానంటూ

Krithi Shetty about Lipkiss: క్యూట్‌ అందాలతో కిల్‌ చేస్తున్న ఉప్పెన భామ.. సిగరేట్‌ తాగడం ప్రాక్టీస్‌ చేశానంటూ

`ఉప్పెన` చిత్రంతో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి. కుర్రాళ్ల కలల రాణిగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇన్నోసెంట్‌ లుక్స్ తో, క్యూట్‌ అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. తొలి చిత్రంతోనే బోల్డ్ సీన్లకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్న ఈ బ్యూటీ నానితో లిప్‌లాక్‌పై రియాక్ట్ అయ్యింది. ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 25 2021, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115

నాని హీరోగా రూపొందిన `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో సాయిపల్లవితోపాటు కృతి శెట్టి ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా శుక్రవారం(డిసెంబర్ 24)విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి శనివారం మీడియాతో ముచ్చటించింది. సినిమాకి వస్తోన్న స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నానితో లిప్‌లాక్‌, సిగరేట్‌ తాగడంపై బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215

బ్యాక్‌ టూ బ్యాక్‌ బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందిస్తూ పాత్ర డిమాండ్‌ చేస్తేనే అలాంటి సన్నివేశాలు చేస్తానని, అవసరం లేదంటే నిర్మోహమాటంగా నో చెబుతానని చెప్పింది. బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తామని, యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతామో, ఇంటెన్స్ సీన్లలోనూ అంతే కష్టపడతామని తెలిపింది. నటులుగా మాకు అన్ని సీన్లు ఒక్కటే అని చెప్పింది. `శ్యామ్ సింగ రాయ్‌`లో బోల్డ్ సీన్ కథకి ముడిపడి ఉంది. అందుకే చేశాం` అని చెప్పింది. 

315

`ఉప్పెన`, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాల్లో నా పాత్రలకు తేడా చాలా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలనుచూశానని, ట్రెడిషన్,కల్చర్‌ గురించి తెలుసుకున్నానని, తనకు విలేజ్‌ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదని అందుకోసం చాలా రీసెర్చ్ చేశానని తెలిపింది. తన పాత్రల కోసం తానే పరిశోధన చేస్తానని చెప్పింది కృతి. 
 

415

`శ్యామ్‌ సింగరాయ్‌`లోని కీర్తి పాత్రకి తాను ఇంగ్లీష్‌ సినిమాలు చేసిందట. అందులో హీరోయిన్లు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుని ఇందులో నటించినట్టు చెప్పింది. తల్లి లేకపోవడంతో తండ్రి పెంపకంలోనే తాను పెరుగుతానని అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను. అందుకే చేతికి మగాళ్ల వాచ్‌ ధరించి, కాస్త మాస్‌గా ఉంటానని తెలిపింది.
 

515

ఈ సినిమాలో కృతి స్మోకింగ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కృతి స్పందిస్తూ, కీర్తి పాత్రలో స్మోకింగ్‌ చేయడమే పెద్ద ఛాలెంజ్‌ అని, `ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయ`ని తెలిపింది.

615

నానితో నటించడంపై రియాక్ట్ అవుతూ, నాని పెద్ద హీరో కావడంతో కాస్త భయంగా అనిపించిందట. కానీ సెట్‌లో ఆయన ఎంతో ప్రోత్సహించారని, సపోర్టివ్‌గా ఉన్నారని తెలిపింది. నాని తన పాత్ర వరకే పరిమితం కాకుండా ఇతర యాక్టర్స్ నటనని కూడా ఆయన చూస్తారని తెలిపింది. నాని ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా నటించినట్టు తెలిపింది కృతి శెట్టి. 
 

715

`నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం` అని చెప్పింది కృతి.

815

`శ్యామ్‌ సింగరాయ్‌`లో సాయి పల్లవి పాత్ర తనకు బాగా నచ్చిందని, తాను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నట్టు చెప్పింది. సినిమా షూటింగ్‌ టైమ్‌లో సాయిపల్లవిని తాను కలవలేదట. తమ ఇద్దరికి మధ్య సీన్లు లేకపోవడం వల్ల కలిసే అవకాశం లేదని తెలిపింది. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదని చెప్పింది. 
 

915

`శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాని తన ఫ్యామిలీ అంతా కలిసి చూశారని, వాళ్ల నాన్న సినిమా చూసి తనని బాగా మెచ్చుకున్నట్టు చెప్పింది. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని ప్రశంసించాడట. 
 

1015

``ఉప్పెన` సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే చాన్స్ వచ్చింది. `ఉప్పెన` తర్వాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ కొత్తగా చేయాలని ఈ పాత్రను ఎంచుకున్నాను. డిఫరెంట్‌ రోల్స్ చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. 
 

1115

`నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే యాక్షన్స్ సీక్వెన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటాను. నేను ఇంత వరకు డ్యాన్స్‌లే చేశాను. అలాంటి యాక్షన్ సినిమాల్లో చేస్తే చాలెంజింగ్‌గా ఉంటుంది. ఓటీటీ ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తా` అని తెలిపింది. కథలను తన అమ్మతో కలిసి వింటామని, నచ్చితేనే చేస్తామని చెప్పింది. 
 

1215

`బంగార్రాజు షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం ఏప్రిలో‌లో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది` అని తెలిపింది కృతిశెట్టి. 

1315

కృతిశెట్టి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది. `శ్యామ్‌ సింగరాయ్‌` ప్రమోషన్‌లో భాగంగా అభిమానులకు కనువిందు చేస్తుంది. 
 

1415

కృతిశెట్టి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది. `శ్యామ్‌ సింగరాయ్‌` ప్రమోషన్‌లో భాగంగా అభిమానులకు కనువిందు చేస్తుంది. 
 

1515

కృతిశెట్టి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది. `శ్యామ్‌ సింగరాయ్‌` ప్రమోషన్‌లో భాగంగా అభిమానులకు కనువిందు చేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image3
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved