- Home
- Entertainment
- రష్మిక, పూజాహెగ్డేకు నిద్ర లేకుండా చేస్తున్న కృతీ శెట్టి, కోలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్
రష్మిక, పూజాహెగ్డేకు నిద్ర లేకుండా చేస్తున్న కృతీ శెట్టి, కోలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్
స్టార్ హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తోంది కృతి శెట్టి. ఇప్పటి వరకూ స్టార్ హీరోయిన్లు గా ఉన్న రష్మిక, పూజా హెగ్డేల ను మించి ఆఫర్లు కొట్టేస్తోంది. ఆ ఇద్దరూ ఈర్షపడేలా అవకాశాలు కొట్టేస్తోంది.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది కృతి శెట్టి . ఈ సినిమా తర్వాత తనకి వరుసగా తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ఇండస్ట్రీలో మరో చిత్రం కమిటైందని సమాచారం.
వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తోంది కృతీ శెట్టి. ఈబ్యూటీ కాల్షీట్స్ కోసం స్టార్స్ సైతం వెయిట్ చేస్తున్నారంటే కృతీ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోలు కృతి ఉంటేనే సినిమా అంటున్నారట.
కృతి శెట్టి వల్ల రష్మిక, పూజా సినిమాలకు గండిపడుతందన్న వాదన ఉంది. కృతి శెట్టి వాళ్ళిద్దరిలా స్కిన్ షో చేయడానికి ఇష్టపడదు. కాని రొమాంటిక్ సీన్స్ అంటే సై అంటోంది. సినిమా కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ అంటోంది. రీసెంట్ గా శ్యామ్ సింగ్ రాయ్ లో నేచురల్ స్టార్ నానీతో కలిసి బెడ్ సీన్ లో రెచ్చిపోయింది బ్యూటీ.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం కొట్టేసిందట కృతి. ధనుష్ కొత్త సినిమా కోసం కృతిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషలలో టాలీవుడ్ ఎనర్టిక్ హీరో రామ్ పొతినేని సరసన ది వారియర్ మూవీలో కృతిశెట్టి నటిస్తోంది.
అలాగే, విలక్షణ దర్శకుడు బాలా - స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలోనూ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ధనుష్ తిరుచిట్రాంబలం, నానే వరువేన్ సినిమాలను డైరెక్ట్ చేసిన అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో మరో సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
ప్రస్తుతం తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న ప్రియాంకా అరుళ్ మోహన్‌ను కృతికి కంటే ముందు ఎంపిక చేయగా, క్యాల్షీట్ సమస్య కారణంగా ఆమె తప్పుకుందట. దాంతో ఈ అవకాశం కృతిశెట్టికి వరించినట్టు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది కృతిశెట్టి. తెలుగులో ఈ యంగ్ బ్యూటీ సుధీర్ బాబు కాంబినేషన్‌లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
అలాగే, ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజికవర్గం సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలను ఆమె హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలో రష్మిక, పూజా హెగ్డేలను దాటేసి దూసుకుపోయే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.