కృతి శెట్టి అందం ముందు చిన్నబోయిన రోజా పువ్వు.. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మత్తుగా చెమటలు పట్టిస్తున్న బేబమ్మ..
టాలీవుడ్‌లో బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి.. చాలా వరకు హద్దుల్లోనే ఉంది. సినిమాల్లోనూ గ్లామర్ షో చేయలేదు. కానీ నెమ్మదిగా ఆమె హాట్ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. మేకర్స్ కి ఎరవేసే క్రమంలో దుమారం రేపుతుంది.
కృతి శెట్టి తొలి చిత్రం `ఉప్పెన` లెహంగా వోణిలో మెరిసింది. పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. ప్రేమ కోసం తండ్రినే ఎదురించే అబ్బాయిగా మెప్పించింది. బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ హృదయాలను దోచుకుంది. తొలి చిత్రంతోనే అద్భుతంగా యాక్ట్ చేసి మెప్పించింది. టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీతోనే స్టార్ అయిపోయిన హీరోయిన్‌గా నిలిచింది.
కృతి శెట్టి చాలా వరకు సినిమాల్లో పద్ధతిగానే కనిపించింది. స్కిన్ షోకి దూరంగానే ఉంది. పాటల్లో గ్లామరస్‌గా కనిపించింది. బట్ ఎక్కడ హద్దులు మీరలేదు. కానీ ఈ బ్యూటీకి విజయాలు దక్కలేదు. పరాజయాలు పెద్ద షాకిచ్చాయి. తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో కృతి శెట్టి తనలోని హాట్ యాంగిల్‌ని ఆడియెన్స్ కి మేకర్స్ కి పరిచయం చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే గ్లామర్ చిత్రాలను పంచుకుంది. ఇందులో ఆమె రోజాపువ్వులతో కెమెరాకి పోజులిచ్చింది. క్యూట్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తూనే రోజా పువ్వులను మించిన అందంతో కట్టిపడేస్తుంది. లేలేత అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో జబ్బల అందాలను చూపిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
ఇందులో మత్తెక్కించే చూపులతో మరింతగా కట్టిపడేస్తుంది. కృతి శెట్టి అందం ముందు రోజా పువ్వులు కూడా చిన్నపోయినట్టే అనేట్టుగా మారిపోయింది. క్యూట్ అందాలతో కృతి శెట్టి గ్లామర్ రెట్టింపు అయ్యింది. దీంతో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
కృతి శెట్టికి `ఉప్పెన` తర్వాత సరైన విజయాలు దక్కలేదు. నాని `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్య `బంగార్రాజు` చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. కానీ `ది వారియర్స్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచర్ల నియోజకవర్గం`, `కస్టడీ` చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఆ ప్రభావం కృతి శెట్టిపై పడింది. ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు రావడం లేదు.
కృతి టాలీవుడ్‌లో సినిమా అవకాశాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుందట. అందుకే గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. కానీ తమిళంలో, మలయాళంలో ఒక్కోసినిమా చేస్తుందీ బ్యూటీ.
కొత్త భామలు కూడా కృతి అవకాశాలు ఎత్తుకుపోతున్నారు. సునామీలా దూసుకొచ్చిన శ్రీలీల చాలా వరకు కృతి అవకాశాలకు బ్రేకులు వేస్తుంది. ఆమెతోపాటు మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి, నేహా శెట్టి వంటి యంగ్ బ్యూటీస్ ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ బ్యూటీల జోరుకి కృతి శెట్టి బేజార్ అయిపోతుందని చెప్పాలి. మరి మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి.
అవకాశాల కోసం ఈ బ్యూటీ గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. హాట్ ట్రీట్‌కి రెడీ అవుతుందట. కమర్షియల్ హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేసేందుకు కూడా రెడీ అవుతుందని తెలుస్తుంది. అందులో భాగంగానే గ్లామరస్‌గానూ ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది కృతి. దీని ద్వారా నెట్టింట తన ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది కృతి.