- Home
- Entertainment
- Brahmamudi: కావ్య, రాజ్ ల మధ్య నిప్పు పెట్టిన స్వప్న.. కూతుర్ని మెడ పట్టి బయటకు గెంటేసిన కృష్ణమూర్తి?
Brahmamudi: కావ్య, రాజ్ ల మధ్య నిప్పు పెట్టిన స్వప్న.. కూతుర్ని మెడ పట్టి బయటకు గెంటేసిన కృష్ణమూర్తి?
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను తప్పు చేసి చెల్లెలి మీద కోపాన్ని పెంచుకున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో దుప్పటి లేకుండా పడుకున్న కావ్యకి జాలితో దుప్పటి కప్పాలనుకుంటాడు రాజ్. కానీ నేను ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను. జాలిపడవలసిన కుటుంబము వీళ్లది అనుకుంటూ దుప్పటి అక్కడే పడేసి స్వప్నని వెతుక్కుంటూ హాల్లోకి వస్తాడు రాజ్. స్వప్న కూడా అప్పుడే లోపలికి వస్తూ రాజ్ కి ఎదురవుతుంది.నువ్వు వస్తావని నాకు తెలుసు నేను ఇక్కడ ఉండడం మంచిదయింది అంటాడు రాజ్. ఇంతలో కావ్యకి కూడా మెలకువ రావటంతో ఆమె కూడా బయటికి వస్తుంది. స్వప్నని చూసి షాక్ అవుతుంది. ఎందుకు వెళ్ళిపోయావు మళ్లీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటూ స్వప్న కి చివాట్లు పెడుతుంది.
ఇప్పుడే మీ అక్కని చూస్తున్నట్లుగా ఎంత గొప్పగా నటిస్తున్నావు. అక్కని మించిన చెల్లెలు చెల్లెలు మించిన అక్క మీ ఇద్దరిని మించిన తల్లి ఏం కుటుంబం మీది అంటూ అంటూ కావ్యని అసహ్యించుకుంటాడు. నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ స్వప్న పక్కకి వెళ్లి నువ్వు ఈ పని ఎందుకు చేసావు నీ మీద మనసు పడటం తప్పా, నన్ను కాదని ఎందుకు వెళ్ళిపోయావు నిన్ను ఎవరు పంపించేశారు అంటూ స్వప్నని నిలదీస్తాడు రాజ్. నాకేమీ తెలియదు నాకు ఏ పాపము తెలియదు నేను పెళ్ళిలో నుంచి నేను వెళ్ళిపోయింది నిజమే కానీ కావ్య తో మీ పెళ్లయిందంటే అందుకు కారణం కావ్యనే అంటూ షాక్ ఇస్తుంది స్వప్న.
అదే మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకుంది అంటుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావు ఇద్దరినీ ఎదురు పడితేనే మండిపోయే వాళ్ళం, ఇలాంటి నిలువెత్తు అహంకారాన్ని ఆడపిల్ల అయినా కోరి పెళ్లి చేసుకుంటుందా పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయి నన్ను బలి చేసిందే కాక నా మీద నిందలు వేస్తున్నావా అంటూ స్వప్న మీద విరుచుకుపడుతుంది కావ్య. నాటకాలు ఆపు నీకు ముందు నుంచి డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలని ఆశ అందుకే టైం చూసుకుని రాజ్ చేత తాళి కట్టించుకున్నావు అంటూ చెల్లెల్ని తిడుతుంది స్వప్న.
ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయి ఇంకా నిజాలు చెప్పు అంటాడు రాజ్. ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు డబ్బున్న వాడి కోసం వెంపర్లాడింది నువ్వు, రాజ్ పెళ్లికి ఒప్పుకుంటే పొంగిపోయింది నువ్వు. నిన్ను రోడ్డుపాలు చేసింది నీ అత్యాశ అంతేకానీ నేను కాదు అంటుంది కావ్య. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి ముందు రోజు పెళ్లి ఇష్టమే అని నాతో ఎందుకు చెప్పావు అని స్వప్నని నిలదీస్తాడు రాజ్. అసలు నేను మీతో ఫోన్ మాట్లాడలేదు అంటుంది స్వప్న. అక్కకి ఈ పెళ్లి ఇష్టమేనేమో అనుకొని నేనే ఎస్ చెప్పాను అంటుంది కావ్య. ఇది కావాలనే చెప్పి ఉంటుంది అంటూ చెల్లెలి మీద నిందలు వేస్తుంది స్వప్న.
స్వప్న చెంప పగలగొడుతుంది కావ్య. ఈ మనిషి ముందు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎందుకు నన్ను చెడ్డ చేస్తున్నావు అంటూ కేకలు వేస్తుంది. కేకలకి మెలుకు వచ్చిన కనకం భర్తని లేపి ఏదో గొడవ అవుతున్నట్లుగా ఉంది అంటుంది. మన ఇంట్లో ఎవరు గొడవ పడతారు పడుకో ఉంటాడు కృష్ణమూర్తి. స్వప్న కూడా కావ్య మీద చెయ్యి ఎత్తుతుంది కానీ ఆమె చేతిని విదిలించి కొడుతుంది కావ్య. ఇన్ని రోజులు నువ్వు ఇన్ని వేషాలు వేసిన కోరుకున్నాను కానీ ఈరోజు నువ్వు నా క్యారెక్టర్ మీద మచ్చ వేస్తున్నావు. అయినా ఆ రోజు అర్ధరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు,
నిన్ను ట్రాప్ చేసింది ఎవరు అంటూ అక్కని నిలదీస్తుంది కావ్య. రాహుల్ పేరు చెప్పడానికి భయపడుతుంది స్వప్న. నువ్వు చెప్పిన సమాధానం మీద నాకు కాపురం నిలబడి ఉంది నువ్వు చేసిన తప్పులకి నన్ను ఎందుకు బలి చేస్తావు అంటుంది కావ్య. ఇంకాపు స్వప్న చెప్పిందే నిజం నా వెనుక ఉన్న ఆస్తి కోసం నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆరోజు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండి ఉంటే ఈ పెళ్లి స్వప్న కి ఇష్టం లేదేమో అనుకొని పెళ్లి ఆపేసేవాడిని తప్పు నీదే అని తేలింది ఇకనుంచి నువ్వు దుక్కిరాల వాళ్లు వదిలేసిన కోడలుగా బ్రతుకు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు రాజ్.
మళ్లీ గొడవకి కనకానికి మెలకువ వచ్చి హాల్లోకి వచ్చి చూసేసరికి అక్కడ స్వప్న కనిపించడంతో షాక్ అవుతుంది. తల్లిని చూసిన స్వప్న నీకోసమే వచ్చాను నన్ను క్షమించు అంటూ తల్లిని హత్తుకుంటుంది. నీలాంటి కూతురికి తల్లిగా బ్రతికే కర్మ నాకు లేదు బయటికి పొమ్మంటూ నెట్టేస్తుంది కనకం. గుమ్మం దాటి బయటికి వెళ్లిన రోజు గుర్తులేని అమ్మ ఈరోజు ఎలా గుర్తుకొచ్చింది.
నువ్వు నాకు చచ్చినదానితో సమానం అంటూ స్వప్న కి స్వప్న కి నానా చివాట్లు పెడుతుంది. తరువాయి భాగంలో హాల్లోకి వచ్చిన కృష్ణమూర్తి స్వప్నని చూసి కోపంతో రగిలిపోతాడు. దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అంటూ మెడ పెట్టి బయటకి గెంటేస్తాడు. నీలాంటి దాన్ని ఇంట్లోకి రానిస్తే పెళ్లి అయిన నా కూతురు భవిష్యత్తు పాడైపోతుంది అంటుంది కనకం.