MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnam Raju: కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు.. అమ్మాయిని చూడకుండానే రెండో భార్యని ఎలా ఓకే చేశాడో తెలుసా?..

Krishnam Raju: కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు.. అమ్మాయిని చూడకుండానే రెండో భార్యని ఎలా ఓకే చేశాడో తెలుసా?..

కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా ఆయన రెండు పెళ్లిళ్లకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 11 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజు(Krishnam Raju) రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్యామలాదేవికి సంబంధించి అందరికి తెలుసు. ఆమె తరచూ బయటకు వస్తుంటారు. కృష్ణంరాజుని వెన్నంటే ఉంటారు. అయితే అంతకు ముందే కృష్ణంరాజుకి మరో పెళ్లి అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుంటే. 

28

కృష్ణంరాజు.. విజయనగర సామ్రాజ్య వారసులు. అందుకే వారి పేరు వెనకాలు `రాజు`అనేది ఉంటుంది. వీరికి అనేక ఆస్తులున్నాయి. వేల ఎకరాల భూములున్నాయి. అయినా నటన అంటే పిచ్చి కృష్ణంరాజుకి. మొదటగా ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. సినిమా రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు ఎలాంటివో తెలిసిందే. 
 

38

వ్యక్తిగత విషయానికి వస్తే, కృష్ణం రాజుకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. యంగ్‌ ఏజ్‌లోనే సీతాదేవితో వివాహం జరిగింది. ఆమె వారి బంధువుల అమ్మాయి కావడం విశేషం. ఆమెకి పిల్లలు లేరు. దీంతో ప్రశాంతి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకి చాలా కాలం క్రిందటే పెళ్లి అయ్యింది. వారు సినిమాలకు దూరంగా ప్రైవేట్‌ లైఫ్‌ని గడుపుతున్నారు. వీరికో పాప కూడా ఉన్నట్టు సమచారం. 
 

48

అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో కన్నుమాశారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో బాగా కుంగిపోయాడు కృష్ణంరాజు. సినిమా కెరీర్‌పై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఆయన ఏడాది పాటు డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఫ్యామిలీ సహకారంతో నెమ్మదిగా కోలుకున్న కృష్ణం రాజుకి మళ్లీ పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మ్యారేజ్‌తో కోలుకుంటాడని భావించారు. 

58

ఆయన కూడా తనకు ఓ తోడు కావాలని నిర్ణయించుకున్నారు. అలా శ్యామలాదేవితో రెండో వివాహం చేశారు. ఆమె వారి బంధువులకు చెందిన ఆమె కాదని, బయటి వారని తెలుస్తుంది. మొత్తంగా 1996లో కృష్ణంరాజు.. శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు జన్మించారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి ఉన్నారు. 

68

కృష్ణంరాజుతో శ్యామలాదేవి వివాహం.. విచిత్రంగా జరిగిందట. అమ్మాయి(శ్యామలాదేవిని చూడ్డానికి తన కజిన్‌ ని పంపించాడట కృష్ణంరాజు. ఆ సమయంలో శ్యామలాదేవి చిన్నపిల్లలతో ఆడుకుంటుందట. ఆ విషయం చెప్పగానే ఇంప్రెస్‌ అయిన కృష్ణంరాజు వెంటనే ఓకే చెప్పాడట. గొప్ప మనస్థత్వం ఉంటేనే అలా చిన్న పిల్లలతో ఆడుకుంటారని ఆయన చెప్పి, అమ్మాయిని చూడకుండానే మ్యారేజ్‌కి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని శ్యామలాదేవి ఓ ఇంటర్వూలో తెలిపింది.
 

78

ముగ్గురు కూతుళ్లపై ఆమె స్పందిస్తూ, ఇద్దరు అమ్మాయిలు పుట్టాక అబ్బాయికోసం కనాలని అనుకున్నారట. కానీ మళ్లీ పాపే పుట్టిందని చెప్పారు. కానీ ఎప్పుడూ ఆడపిల్లలా అనే ఫీల్ అవ్వలేదు. ఎక్కడికెళ్లినా ముగ్గురు ఆడపిల్లలా అంటే ఎంత అదృష్టవంతురాలు మీరు అని అంటున్నట్టు చెప్పారు. అంతేకాదు తాను కృష్ణంరాజుగారికి అభిమానిని అని, ఆయన్నే పెళ్లి చేసుకోవగం దేవుడిచ్చిన వరం అని తెలిపింది. 

88

పెద్ద కుమార్తె సాయి ప్రసీదని నిర్మాతని చేశారు కృష్ణంరాజు. ఇటీవల ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` చిత్రంతో ఆమెని నిర్మాతగా పరిచయంచేశారు. తన తమ్ముడు సూర్యనారాయణతో కలిసి తాను స్థాపించిన గోపీకృష్ణ మూవీస్‌ పతాకం నిర్మాణ బాధ్యతలు ప్రసీదకి అప్పగించారు కృష్ణంరాజు. ఈ బ్యానర్‌పై మరిన్ని సినిమాలు తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఆయన కన్నుమూయడం అత్యంత బాధాకరం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved