- Home
- Entertainment
- AOT Day 1 Collections: ఆకాశంలో ఒక తార కలెక్షన్లు.. దుల్కర్ సల్మాన్ మూవీ టాక్‌కి, వసూళ్లకి సంబంధమే లేదు
AOT Day 1 Collections: ఆకాశంలో ఒక తార కలెక్షన్లు.. దుల్కర్ సల్మాన్ మూవీ టాక్‌కి, వసూళ్లకి సంబంధమే లేదు
దుల్కర్ సల్మాన్, కొత్త అమ్మాయి సాత్విక వీరవల్లి జంటగా, శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించిన `ఆకాశంలో ఒక తార`కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉందంటే?

ఆకాశంలో ఒక తార మూవీకి పాజిటివ్ టాక్
దుల్కర్ సల్మాన్.. మలయాళ నటుడు అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నారు. ఆల్మోస్ట్ తెలుగు హీరోగా నిలబడ్డాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. క్లీన్ ఫిల్మ్స్ తో మహిళా ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. అందులో భాగంగా ఇప్పుడు `ఆకాశంతో ఒక తార` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటించింది. శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. మహిళా సాధికారత కలిగిన చిత్రంగా అభివర్ణించారు. మరి కమర్షియల్‌గా ఈ మూవీ ఎలా ఉందనేది చూస్తే.
ఆకాశంలో ఒక తార మూవీ కలెక్షన్లు
`ఆకాశంలో ఒక తార` మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. మొదటి రోజు సుమారు నాలుగు కోట్లు వసూలు చేసిందట. ఇండియాలో మూడు కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రాల్లో ఇది చాలా తక్కువ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా సుమారు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని సమాచారం. ఓటీటీ రైట్స్ రూ.34కోట్లకు అమ్ముడుపోయింది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇక ముప్పై కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో విడుదలైంది. అంటే బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సుమారు రూ.60కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వస్తోన్న కలెక్షన్లు చూస్తుంటే అది కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఇది ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఆకాశంలో ఒక తార మూవీ కథ ఏంటంటే?
`అకాశంలో ఒక తార` సినిమా అమ్మాయి తాను ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. తండ్రి దాన్ని వ్యతిరేకిస్తాడు. తల్లి ప్రోత్సహిస్తుంది. కానీ పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేస్తారు. దుల్కర్ సల్మాన్ ఆమె కల గురించి తెలుసుకుంటాడు. ఆ దిశగా ప్రోత్సహిస్తాడు. అందుకోసం ఆయన ఎన్నో కూలీ పనులు చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ చాలా అవమానాలు ఫేస్ చేస్తుంది. వాటిని దాటుకొని ప్లాస్మా ద్వారా రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపించవచ్చనే కొత్త ఐడియాకి శ్రీకారం చుడుతుంది. రెండు మూడు సార్లు ఫెయిల్ అవుతుంది. అంతిమంగా అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలతో కలిసి దాన్ని సాధించడం, అంతరిక్షంలోకి వెళ్లి రావడమనేది ఈ చిత్ర కథ.














