MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట శ్రీనివాసరావుని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొడితే సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ ఏంటో తెలుసా? కోటకి ఫ్యూజుల్‌ ఔట్‌

కోట శ్రీనివాసరావుని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొడితే సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ ఏంటో తెలుసా? కోటకి ఫ్యూజుల్‌ ఔట్‌

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుని ఎన్టీఆర్‌ అభిమానులు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కొట్టారు. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ చూసి కోట షాక్‌ అయ్యారట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 03 2025, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విలక్షణ నటుడిగా మెప్పించిన కోట శ్రీనివాసరావు
Image Credit : Asianet News

విలక్షణ నటుడిగా మెప్పించిన కోట శ్రీనివాసరావు

తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల(జులై) 13న ఆయన తుది శ్వాస విడిచారు. దాదాపు 750కిపైగా చిత్రాల్లో నటించిన కోట చేయని పాత్రంటూ లేదు. హీరోగా తప్ప మిగిలిన అన్ని రకాల పాత్రలు పోషించారు. నెగటివ్‌ రోల్స్, తండ్రిగా, తాతగా, బాబాయ్‌గా, మామయ్యగా, లేడీ గెటప్‌లోనూ కనిపించారు. అదే సమయంలో ఓ మూవీలో గే గా కూడా కనిపించారు. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌ లో అయినా తెలంగాణ యాసని రక్తికట్టించారు.

DID YOU
KNOW
?
దెబ్బలు తిన్న కోట శ్రీనివాసరావు
తెలుగు సినిమాల్లో ‘మండలాధీశుడు’ (1987) రాజకీయ దుమారం రేపిన చిత్రం. ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేసిన కోట శ్రీనివాసరావుపై నిజంగా ఎన్టీఆర్ అభిమానులు విజయవాడ రైల్వే స్టేషన్లో దాడి చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`మండలాధీశుడు` సినిమాలో సీఎం పాత్రలో కోట
Image Credit : youtube print shot/Idream media

`మండలాధీశుడు` సినిమాలో సీఎం పాత్రలో కోట

ఇదిలా ఉంటే కోట శ్రీనివాసరావు ఓ సినిమా విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు. కృష్ణ కారణంగా దెబ్బలు తినాల్సి వచ్చింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ `మండలాధీశుడు` సినిమా తీశారు. ఇందులో ఆయన నటించలేదు, కానీ తెరవెనుక ఉండి దర్శకుడు ఎం ప్రభాకర్‌ రెడ్డి, నిర్మాత డీవీ నరసరాజులతో తీయించారు. ఇందులో కోట లీడ్‌ రోల్‌ చేశారు. 1987లో ఫిబ్రవరి 26న ఈ మూవీ విడుదలైంది. మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా రూపొందించారు కృష్ణ. అప్పుడు రామారావు సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంగా రామారావు పాలనా లోపాలను ఎత్తిచూపుతూ ఒక సెటైరికల్‌ ఈ మూవీగా దీన్ని తీశారు. 

35
కోట శ్రీనివాసరావుని కొట్టిన ఎన్టీఆర్‌ అభిమానులు
Image Credit : Facebook/Kota Srinivasa Rao, Balakrishna

కోట శ్రీనివాసరావుని కొట్టిన ఎన్టీఆర్‌ అభిమానులు

ఇందులో సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు పోషించారు. ఆయన ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు, కానీ కృష్ణనే పట్టుబట్టి నటింపచేశారు.  విడుదలయ్యాక ఈ మూవీ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బాగా వ్యతిరేకించారు. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్‌ ని పోలిన సీఎం పాత్రని కోట శ్రీనివాసరావు నటించడంతో ఆయన్ని పగబట్టారు రామారావు అభిమానులు. ఓ సారి కోట శ్రీనివాసరావు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనిపించినప్పుడు పట్టుకుని బాగా కొట్టారట . కోట శ్రీనివాసరావునే ఈ విషయాన్ని వెల్లడించారు.

45
కోట దెబ్బలు తిన్న విషయం తెలిసి కృష్ణ రియాక్షన్‌ ఏంటంటే?
Image Credit : ANI

కోట దెబ్బలు తిన్న విషయం తెలిసి కృష్ణ రియాక్షన్‌ ఏంటంటే?

అయితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కొట్టిన విషయం సూపర్‌ స్టార్‌ కృష్ణకి తెలిసింది. ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ చూసి షాక్‌ అయ్యారు కోట. సాధారణంగా మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే, దెబ్బలు తినే పరిస్థితి ఉంటే సానుభూతి చూపిస్తారు. అయ్యో పాపం అంటారు. కానీ కృష్ణ మాత్రం అందుకు రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. కోటని చూసి నవ్వుతూ వచ్చిన కృష్ణ `ఏమయ్యా బెజవాడలో నిన్ను కొట్టారటగా` అంటూ నవ్వుతున్నారట. అదేం సార్‌ అంటూ ఆశ్చర్యపోవడం కోట వంతు అయ్యిందట.

55
కృష్ణ గొప్పతనం చెప్పిన కోట
Image Credit : Youtube print shot/etvteluguindia

కృష్ణ గొప్పతనం చెప్పిన కోట

సూపర్‌ స్టార్‌ కృష్ణ చాలా జోవియల్‌ పర్సన్‌. ఏదున్నా మొహం మీదే చెబుతారు. సినిమా ఫ్లాఫ్‌ అయినా అలానే రియాక్ట్‌ అవుతారు. `సినిమా పోయిందయ్యా` అని వెంటనే అనేస్తారు అని తెలిపారు కోట శ్రీనివాసరావు. ఐడ్రీమ్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట ఈ విషయాలను వెల్లడించారు. `మండలాధీశుడు` సినిమా తర్వాత  ఆఫర్లు తగ్గితే కృష్ణనే తనకు ఆఫర్స్ ఇప్పించారని తెలిపారు. చాలా మంది దర్శక నిర్మాతలు వచ్చి కృష్ణగారు చెప్పారు అని తనని బుక్‌ చేసుకునేవారట. అలా కృష్ణగారి గొప్పతనాన్ని కోట వెల్లడించారు. ఇప్పుడు అటు సూపర్‌ స్టార్‌ కృష్ణ, కోట శ్రీనివాసరావు ఇద్దరూ మన మధ్య లేకపోవడం బాధాకరం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణ ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
కృష్ణ ను హీరోగా సెలెక్ట్ చేసిన మరో హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ చెప్పిన రహస్యం.
Recommended image2
లోకేష్‌ కనగరాజ్‌పై రజనీ సెటైర్లు.. బాల్య స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ నాగ్‌ గురించి ఏమన్నాడంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved