- Home
- Entertainment
- లోకేష్ కనగరాజ్‌పై రజనీ సెటైర్లు.. బాల్య స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ నాగ్ గురించి ఏమన్నాడంటే
లోకేష్ కనగరాజ్‌పై రజనీ సెటైర్లు.. బాల్య స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ నాగ్ గురించి ఏమన్నాడంటే
`కూలీ` ఆడియో లాంచ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు.

`కూలీ` ట్రైలర్ తో అంచనాలు పెంచిన రజనీకాంత్
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా `కూలీ`. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగింది. ఇందులో ట్రైలర్ విడుదల చేశారు. ఎమోషనల్‌గా, యాక్షన్ ప్రధానంగా ట్రైలర్ సాగింది. ఇందులో రజనీ రెచ్చిపోయారు. ఆయనతోపాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ సైతం తమదైన యాక్షన్ తో అదరగొట్టారు. కేవలం యాక్షనే కాదు, ఎమోషన్స్ కి కూడా పెద్ద పీఠ వేయడం విశేషం.
KNOW
సత్యరాజ్ మనసులో ఉన్నది చెబుతాడుఃరజనీకాంత్
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రజనీకాంత్ వేదికపైకి మాట్లాడటానికి వచ్చినప్పుడు, హాలు చప్పట్లతో మారుమోగింది. ఆ తర్వాత తన సిగ్నేచర్ డైలాగ్‌తో మాట్లాడటం ప్రారంభించిన రజనీకాంత్, ``నన్ను బ్రతికించిన దేవుళ్ళు, తమిళ ప్రజలు`` అని చెప్పి, 38 సంవత్సరాల తర్వాత సత్యరాజ్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడారు. `కొన్ని విషయాల్లో సత్యరాజ్‌తో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ అతను తన మనసులో ఉన్నది చెబుతాడు. మనసులో ఉన్నది చెప్పే వారిని మీరు నమ్మవచ్చు. కానీ లోపల దాచుకునే వారిని మీరు నమ్మకూడదు` అని అన్నారు రజనీకాంత్.
లోకేష్ కనగరాజ్‌పై రజనీకాంత్ సెటైర్లు
ఇందులో `కూలీ` దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి రజనీ మాట్లాడుతూ, ఈ సినిమాకి నిజమైన హీరో మరెవరో కాదు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ నాతో చేరుతున్నాడు. అది కూడా భారీ తారాగణంతో, ఈ కాంబో తుఫాను సృష్టిస్తుంది. ఇటీవల, లోకేష్ 2 గంటల పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను కూర్చుని చూశాను, అది పూర్తవ్వలేదు. తరువాత పడుకుని చూశాను అయినా అయిపోలేదు, నేను మేల్కొని చూశాను, అయినా అది అసాధ్యం` అంటూ లోకేష్‌పై సెటైర్లు పేల్చారు రజనీకాంత్.
నాగార్జునపై రజనీకాంత్ ప్రశంసలు
`కూలీ`లో హీరో నాగార్జున నెగటివ్ రోల్ చేశారు. ఆయన గురించి రజనీ మాట్లాడుతూ, నాగార్జున ఈ వయసులో చాలా అందంగా కనిపిస్తున్నాడు. నా జుట్టు అంతా ఊడిపోయింది. కానీ మీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి అని నేను అడిగాను. దానికి ఆయన, ఏమీ లేదు సార్, ఇది వ్యాయామం వల్ల మాత్రమే అని అన్నారు. నాగార్జున నెగటివ్ రోల్‌లో అద్భుతంగా నటించాడు` అని వెల్లడించారు.
చిన్ననాటి స్నేహితుడిని గుర్తు చేసుకున్న రజనీకాంత్
ఈ ఈవెంట్‌లో తన స్నేహితుడు రాజ్ బహదూర్‌ని గుర్తు చేసుకున్నారు రజనీకాంత్. `చిన్నప్పుడు నా స్నేహితుడు తన బంగారు గొలుసును ఇచ్చి, "నువ్వు సినిమాల్లో నటించు" అని అన్నాడు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను` అని స్నేహితుడిపై ప్రశంసలు కురిపించారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు రజనీకాంత్. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 14న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.