- Home
- Entertainment
- రోజా మేడం ఇక్కడ మానేసి అక్కడ స్టార్ట్ చేశారు.. కృష్ణ భగవాన్ సెటైర్లు, ఎమోషనల్ అయిన ఏపీ మినిస్టర్
రోజా మేడం ఇక్కడ మానేసి అక్కడ స్టార్ట్ చేశారు.. కృష్ణ భగవాన్ సెటైర్లు, ఎమోషనల్ అయిన ఏపీ మినిస్టర్
ప్రస్తుతం బుల్లితెర నటులు,జబర్దస్త్ కమెడియన్లు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే జబర్దస్త్ టీం మాత్రం ఒక స్పెషల్ ఎపిసోడ్ తో సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం బుల్లితెర నటులు,జబర్దస్త్ కమెడియన్లు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే జబర్దస్త్ టీం మాత్రం ఒక స్పెషల్ ఎపిసోడ్ తో సిద్ధం అవుతోంది. తెలుగులో పాపులర్ కామెడీ షోగా దూసుకుపోతున్న జబర్దస్త్ త్వరలో అరుదైన మైలురాయి అందుకోబోతోంది. జనవరి 5న జబర్దస్త్ 500 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి ఏపీ మంత్రి.. జబర్దస్త్ మాజీ జడ్జి రోజాని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనితో రోజా హాజరై.. కమెడియన్ల స్కిట్ లు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి ఇంద్రజ, కృష్ణ భగవాన్ జడ్జీలుగా ఉంటుంది సంగతి తెలిసిందే. వారితో పాటు రోజా జడ్జి స్థానంలో కూర్చున్నారు.
దీనితో కమెడియన్లంతా తమ స్కిట్ లో రోజా ప్రస్తావన వచ్చే విధంగా చూసుకున్నారు. రోజా గురించి కృష్ణ భగవాన్ మాట్లాడుతూ తనదైన శైలిలో ఫన్నీ సైటైర్లు వేశాడు. రోజా మేడమ్ మీ అందరిపైనా కౌంటర్లు వేయడం గుర్తుకొస్తున్నాయి. అయితే ఈ కౌంటర్లని ఆమె అక్కడ వేస్తున్నారులే అంటూ కృష్ణ భగవాన్ అన్నారు. పరోక్షంగా ఆమె పొలిటికల్ విమర్శలని గుర్తు చేశారు.
కమెడియన్ నూకరాజు.. యాంకర్ సౌమ్య రావు పై వేసిన సెటైర్లు కూడా కడుపుబ్బా నవ్వించాయి. 'డైరెక్టర్ యాంకర్ ని పిలిచి 500 ఎపిసోడ్ అన్నారట. 500 పేమెంటా , కన్వీనెన్సా అర్థం కాక ఆమె అలా కన్ఫ్యూజన్ లో కూర్చుండి పోయారు అని నూకరాజు చెప్పడం తో అంతా నవ్వేశారు.
ఇక చివర్లో జబర్దస్త్ టీం మంత్రి రోజాని సన్మానించారు. సీనియర్ కమెడియన్ గా రాకెట్ రాఘవ కూడా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
నాతో పాటు చేసిన చాలా మంది హీరోయిన్స్ ని ప్రేక్షకులు మరచిపోయారు. కానీ నేను ఇప్పటి జనరేషన్ కి కూడా గుర్తు ఉన్నాను అంటే అది జబర్దస్త్ వల్ల మాత్రమే అని రోజా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా రోజా జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు. కానీ మంత్రి పదవి దక్కాక ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పక తప్పలేదు.