Chiranjeevi: చిరంజీవిపై కోట షాకింగ్ కామెంట్స్.. ఇలా రివర్స్ అయ్యారేంటి..
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు నటన ప్రతిభ గురించి వివరించాల్సిన అవసరం లేదు. వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు రీత్యా సినిమాలు తగ్గించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు నటన ప్రతిభ గురించి వివరించాల్సిన అవసరం లేదు. వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు రీత్యా సినిమాలు తగ్గించారు. ఇటీవల కోట శ్రీవాసరావు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో తెలుగు నటులకే అవకాశం ఇవ్వాలని కోట శ్రీనివాసరావు తరచుగా చెబుతుంటారు.
తాజాగా కోట శ్రీనివాసరావు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. చిరంజీవిపై గౌరవం ఉండే కోట ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి.. ఇలా రివర్స్ అయ్యారు ఏంటి అనే చర్చ జరుగుతోంది.
కొన్నిరోజుల క్రితం మే డే కార్యక్రమాల్లో భాగంగా ఓ సమావేశంలో చిరంజీవి చిత్రపురి కాలనిలో ఆసుపత్రి కట్టించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపైకోట శ్రీనివాసరావు ఓ యూట్యూబ్ ఛానల్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు సినీ కార్మికులకు తిండి పెట్టే ఏర్పాట్లు చేయాలని అన్నారు. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరు వస్తారు. కృష్ణ నగర్ లో చాల మంది సినీ కార్మికులు ప్రతిభ ఉన్నపటికీ అవకాశాలు లేక వ్యసనాల పాలు అవుతున్నారు.
Chiranjeevi
వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అపోలో ఆసుపత్రికి వెళతారు..అంతే కానీ చిరంజీవి కట్టే ఆసుపత్రికి రారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి తాను కళాకారుడిని కాదని.. సినీ కార్మికుడిని అని అన్నారు. దీనిపై కూడా కోట శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శలు చేశారు.
కోట్ల రూపాయల పారితోషికం అందుకునే చిరంజీవి కార్మికుడు ఎలా అవుతారు అని కోట ప్రశ్నించారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవం అని అంటూనే.. ఇలాంటి మాటలు మాట్లాడితే నచ్చదు అని అన్నారు.
కార్మికుడిని అని చెప్పుకునే చిరంజీవి ఏరోజైనా ఎవరికైనా సాయం చేసారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా తన సినిమాల్లో వేషాలు ఇప్పించారా అని అడిగారు. తాను తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి 500, 1000 ఇచ్చి పంపుతుంటానని అన్నారు. 5 లక్షల వరకు సాయం చేశా. కనై ఎప్పుడూ తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పను అని కోట అన్నారు. సడెన్ గా కోట చిరంజీవిని ఇలా విమర్శించడం షాకింగ్ గా మారింది. చిరంజీవితో ఏ విషయంలో అయినా కోటకు చెడిందా అనే చర్చ జరుగుతోంది.