MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • రోజుకి రెండు కోట్లు, పబ్లిక్ గా చెప్పేస్తున్నారు.. బాత్రూం బ్రష్ లు కూడా వదలట్లేదు, హీరోలపై కోట సెటైర్స్ 

రోజుకి రెండు కోట్లు, పబ్లిక్ గా చెప్పేస్తున్నారు.. బాత్రూం బ్రష్ లు కూడా వదలట్లేదు, హీరోలపై కోట సెటైర్స్ 

కోట శ్రీనివాసరావు హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. 

Sreeharsha Gopagani | Published : Jun 03 2023, 09:16 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు నటన ప్రతిభ గురించి వివరించాల్సిన అవసరం లేదు. వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు రీత్యా సినిమాలు తగ్గించారు. ఇటీవల కోట శ్రీవాసరావు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో తెలుగు నటులకే అవకాశం ఇవ్వాలని కోట శ్రీనివాసరావు తరచుగా చెబుతుంటారు. 

26
Asianet Image

కోట శ్రీనివాసరావు హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. కోట మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ లా మరొకరు రారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు వీళ్ళెవరూ తాము ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెప్పుకోలేదు. 

36
Kota Srinivasa Rao

Kota Srinivasa Rao

కానీ ఇప్పుడు మేము రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నాం అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇవాళ సినిమా అనేది ఎక్కడ ఉంది.. అంతా సర్కస్ మాత్రం ఉంది. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు అంటూ కోట హీరోలపై సెటైర్లు వేశారు. 

46
Asianet Image

అలాగే హీరోలు చేస్తున్న వాణిజ్య ప్రకటనలపై కూడా కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు బాత్ రూమ్ బ్రష్ ల దగ్గర నుంచి బంగారం వరకు ఏవీ వదలడం లేదు. అన్ని ప్రకటనలు చేసేస్తున్నారు. హీరోలు ఆ స్థాయిలో సంపాదిస్తుంటే మిగిలిన నటులకు సంపాదన ఎలా ఉంటుంది అని కోట శ్రీవాసరా రావు ప్రశ్నించారు. 

56
Asianet Image

కోట శ్రీనివాసరావు కామెంట్స్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కోటని విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో తాను రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. 

66
Asianet Image

ఈయన బాధ ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హీరోల స్టార్ స్టేటస్ ని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. అలాగే వాణిజ్య ప్రకటనలు స్టార్ హీరోలని ఆ సంస్థలు ఎంపిక చేసుకుంటాయి. ఇందులో నీకు వచ్చిన నష్టం ఏంటి అని నెటిజన్లు కోటని ప్రశ్నిస్తున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories