కొరటాల చేసిన బిగ్ మిస్టేక్ అదే.. 'దేవర' 1000 కోట్లు ఎలా మిస్ అయిందో తెలుసా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం ఫలించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కంటెంట్ పరంగా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నం ఫలించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కంటెంట్ పరంగా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఎన్టీఆర్ క్రేజ్ తో భారీ వసూళ్లు సాధించింది.
లాంగ్ రన్ లో ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల వసూళ్లు సాధించింది. సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ దేవర చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవర మూవీ చూశాక తన శైలిలో పరుచూరి విశ్లేషణ అందించారు. పరుచూరి మాట్లాడుతూ దేవర చిత్రం సముద్రపు దొంగల కథ. భయం ఎరుగని దొంగలు వాళ్ళు. హీరో దొంగగా చెడ్డవాడిగా ఉండి ఆ తర్వాత మారడం అనేది చాలా చిత్రాల్లో చూశాం. కానీ కొరటాల శివ ఈ చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు.
ఈ చిత్రంతో కొరటాల శివ మరోసారి స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించుకున్నారు. తెలిసిన కథే అయినప్పటికీ కథనం గొప్పగా ఉంటే ఏ చిత్రం అయినా విజయం సాధిస్తుంది అని చెప్పడానికి దేవర ఉదాహరణ. సంగీతం గొప్పగా లేదు. కథ కూడా గొప్ప కథ అనడానికి లేదు. చిన్న పాయింట్ తో దాదాపు 3 గంటల నిడివి ఉన్న చిత్రం తెరకెక్కించాలి అంటే పెద్ద సాహసమే.
మొదటి వారంలో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది అని విన్నాను. అయినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనమే అని పరుచూరి ప్రశంసించారు. సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ అనిపించింది. కొరటాల శివ కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉండి ఉంటే దేవర చిత్రం 1000 కోట్ల వసూళ్లు సాధించేది అని పరుచూరి అన్నారు.
దేవర కొడుకు వర కథని ఫస్ట్ హాఫ్ లో చూపించి ఉండాలి. ఇంటర్వెల్ నుంచి దేవర కథ ప్రారంభిచి ఉంటే అద్భుతంగా ఉండేది ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర కథ ఉండడం వల్ల అమాంతం గ్రాఫ్ పెరిగి సెకండ్ హాఫ్ లో బాగా తగ్గిపోయింది. అదే వర కథతో సినిమా ప్రారంభం అయి ఉండి ఉంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ పీక్ కి వెళ్లి ఉండేది. టాక్ కూడా చాలా బావుండేది. ఫస్ట్ హాఫ్ లో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ లవ్ సీన్స్ కి స్కోప్ ఉండేది. సెకండ్ హాఫ్ లో అంత నిడివి లాగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొరటాల ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండి ఉంటే దేవర చిత్రం సులభంగా 1000 కోట్లు దాటి ఉండేది అని పరుచూరి తెలిపారు.