MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి ఇక తాతగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు, ఒక్క ఆన్సర్ తో అంతా నోర్లు మూసుకున్నారు

Chiranjeevi: చిరంజీవి ఇక తాతగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు, ఒక్క ఆన్సర్ తో అంతా నోర్లు మూసుకున్నారు

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రానికి కోన వెంకట్ రచయితగా పనిచేశారు. తన బంధువులే చిరంజీవిపై కామెంట్స్ చేస్తుంటే వాళ్ళ నోర్లు మూయించానని కోన వెంకట్ అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2026, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా తిరుగులేని మాస్ హిట్లు కొడుతున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 137 కోట్ల షేర్ సాధించి చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో చిరు చేసిన అల్లరి, పండించిన సెంటిమెంట్, పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాస్ హిట్లు కొడుతున్న మెగాస్టార్
Image Credit : Kona Venkat\Twitter

మాస్ హిట్లు కొడుతున్న మెగాస్టార్

ఈ సినిమాని మించేలా ఈ ఏడాది విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు మూవీ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా 190 కోట్ల షేర్ రాబట్టింది. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. సినిమా సినిమాకి మెగాస్టార్ కలెక్షన్స్ సునామీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. వాల్తేరు వీరయ్య చిత్రానికి రచయితగా పని చేసిన కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భోళా శంకర్ సినిమా గురించి కామెంట్స్ చేశారు.

Related Articles

Related image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Related image2
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
35
ఆ సినిమా రీమేక్ చేయడం తప్పు
Image Credit : Kona Venkat\Twitter

ఆ సినిమా రీమేక్ చేయడం తప్పు

వేదాళం లాంటి సినిమాని రీమేక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేదాళం రిలీజ్ అయిన టైంలోనే ఇది చాలా పాతతరం కథ అంటూ విమర్శలు వచ్చాయి. అజిత్ క్రేజ్ వల్ల కమర్షియల్ గా హిట్ అయింది. ఇది పదేళ్ల క్రితం రావలసిన సినిమా అని కామెంట్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ నే పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి చిత్రాన్ని పదేళ్ల తర్వాత చిరంజీవి కోసం రీమేక్ చేస్తే ఎలా ? అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయింది. చిరంజీవికి రెడీ మేడ్ కథలు తీసుకురాకూడదు. మనమే టైలర్ గా మారి పక్కా కొలతలతో కథని రెడీ చేయాలి.

45
చిరంజీవి ఇక తాతలా నటించాలి
Image Credit : Facebook/Chiranjeevi konidela

చిరంజీవి ఇక తాతలా నటించాలి

అలా చేసిన కథే వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారు యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ అద్భుతంగా చేస్తారు. అవన్నీ వాల్తేరు వీరయ్యలో ఉన్నాయి కదా అని కోన వెంకట్ తెలిపారు. రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా కజిన్స్ కొంతమంది నా ముందే కామెంట్స్ చేశారు. చిరంజీవి ఇలా తాత లాగా నటించవచ్చు కదా. రజినీకాంత్ చేశాడు చూడండి అని అన్నారు. చిరంజీవి తాత లాగా నటించాలి అని గుచ్చి గుచ్చి అడిగారు.

55
అంతా నోర్లు మూసుకున్నారు
Image Credit : our own

అంతా నోర్లు మూసుకున్నారు

నేను వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడిగా. సరే అయితే.. చిరంజీవి గారి ఒరిజినల్ ఏజ్ పక్కన పెట్టండి. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని చూడగానే ఎంత వయసున్న వ్యక్తిలా అనిపించారు ? నిజాయతీగా సమాధానం చెప్పండి ? అని అడిగా. వాళ్ళ నుంచి 40 ప్లస్ అనే ఆన్సర్ వచ్చింది. మీకు 40 ఏళ్ళ వ్యక్తిలా కనిపించే హీరో తాత పాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగా.. ఒక్కరి నుంచి సమాధానం లేదు. అంతా నోర్లు మూసుకున్నారు అని కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image2
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved