- Home
- Entertainment
- ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే
ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే
చిరంజీవితో ఓ అగ్ర దర్శకుడికి విభేదాలు వచ్చాయట. దీనితో ఆ దర్శకుడు చిరంజీవితో సినిమాలు తగ్గించి బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు అనే ప్రచారం ఉంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి కెరీర్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ లో రీజినల్ సినిమాల్లో హైయెస్ట్ షేర్ రాబట్టిన చిత్రంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిరంజీవి గత సినిమాలు, కెరీర్ విశేషాలు గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి తన కెరీర్ లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులతో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలో కూడా అనేక చిత్రాల్లో నటించారు.
కోడి రామకృష్ణ తొలి చిత్రం
కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయింది చిరంజీవి సినిమాతోనే. కోడి రామకృష్ణ తొలి చితం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో కోడి రామకృష్ణ.. రాఘవేంద్ర రావు, దాసరి, కోదండ రామిరెడ్డి లాంటి అగ్ర దర్శకులకు పోటీగా సినిమాలు చేసేవారు.
అందుకే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు
చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేశారు. కానీ మధ్యలో చిరంజీవికి, కోడి రామకృష్ణకి మధ్య విభేదాలు తలెత్తాయట. దీనితో కోడి రామకృష్ణ చిరంజీవితో సినిమాలు తగ్గించి బాలకృష్ణతో చేయడం ప్రారంభించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు లాంటి సినిమాలు బాలకృష్ణకి తిరుగులేని విజయాలు అందించాయి.
అది నిజమే అంటూ కామెంట్స్
చిరంజీవితో విభేదాలు రావడం వల్లే.. కోడి రామకృష్ణ ఆ సినిమాలని బాలయ్యతో చేశారు అనే ప్రచారం ఉంది. దీనిపై కోడి రామకృష్ణ శిష్యుడు ప్రముఖ దర్శకుడు దేవీ ప్రసాద్ స్పందించారు. ఒక దశలో కోడి రామకృష్ణ గారు చిరంజీవితో సినిమాలు తగ్గించిన మాట వాస్తవమే. మేము కూడా అనుకునేవాళ్లం. చిరంజీవితో గురువుగారు ఒక సినిమా చేస్తే బావుంటుంది.. చాలా గ్యాప్ వచ్చింది అని అనుకునేవాళ్లం.
వ్యక్తిగత గొడవలు లేవు
కానీ వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా మాత్రమే ఎలాంటి విభేదాలు లేవు అనేది తన అభిప్రాయం అని దేవి ప్రసాద్ అన్నారు. వాళ్లిద్దరూ ఎక్కడ కలిసినా చాలా సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించేవాళ్ళు. వాళ్ళ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండి ఉండొచ్చు.. నాకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎలాంటి విభేదాలు లేవు అని దేవి ప్రసాద్ అన్నారు.

