- Home
- Entertainment
- చిరంజీవి మూవీ ఫ్లాప్ అని భార్య ఫోన్, ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదికి వెళ్లిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
చిరంజీవి మూవీ ఫ్లాప్ అని భార్య ఫోన్, ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదికి వెళ్లిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మెగాస్టార్ చిరంజీవికి 1983 సంవత్సరం చాలా బాగా కలసి వచ్చింది. సాధారణ నటుడిగా ఉన్న చిరంజీవి స్టార్ హీరో అయింది ఈ ఏడాది లోనే. 1983లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఖైదీ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది.అదే ఏడాది ఆరంభంలో ఒక మ్యాజిక్ జరిగింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి 1983 సంవత్సరం చాలా బాగా కలసి వచ్చింది. సాధారణ నటుడిగా ఉన్న చిరంజీవి స్టార్ హీరో అయింది ఈ ఏడాది లోనే. 1983లో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఖైదీ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. చిరంజీవి నటన, డ్యాన్సులు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాం. మెగాస్టార్ మాస్ మ్యానరిజమ్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
megastar chiranjeevi
అదే ఏడాది ఆరంభంలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే అభిలాష చిత్రం. మరణ శిక్షని రద్దు చేయాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం అది. చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రంలో రావు గోపాల్ రావు విలన్ గా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంతో చిరంజీవి ప్రతిభతో పాటు, కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ కూడా అందరికీ తెలిసొచ్చింది.
Kondandarami Reddy
అభిలాష చిత్రం తనకి లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని కోదండరామిరెడ్డి అన్నారు. ఎందుకంటే ఈ చిత్రానికి తాను తెరకెక్కించిన రెండు మూడు చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో ఒక చిత్రంలో నన్ను హీరోగా ఎంపిక చేసి ఆ తర్వాత తొలగించారు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మరొక దర్శకుడితో ఆ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ రోజు ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ తర్వాత అభిలాష చిత్రంతో మరో ఛాన్స్ వచ్చింది.
Kodanda Ramireddy
అభిలాష చిత్రం రిలీజ్ కి కొన్ని రోజుల ముందు చెన్నైలో ప్రీవ్యూ ప్రదర్శించారు. ఆ సమయంలో తాను తదుపరి చిత్రం వర్క్ కోసం హైదరాబాద్ లో ఉన్నాను అని కోదండరామిరెడ్డి తెలిపారు. చెన్నైలో ప్రీవ్యూ నా భార్య చూసింది. మిగిలిన సెలెబ్రిటీలు, సినిమా చూసిన వారి రెస్పాన్స్ తెలుసుకుంది. నాకు ఫోన్ చేసి ఈ సినిమా కూడా బాగాలేదు అని అంటున్నారండీ అని చెప్పింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను, నాతో పాటు యండమూరి వీరేంద్రనాథ్ ఇద్దరం ఏడుస్తూ ట్యాంక్ బండ్ మీదికి వెళ్లాం. చాలా సేపు బాధపడ్డాం.
Chiranjeevi
కానీ సినిమా రిలీజ్ అయ్యాక మ్యాజిక్ జరిగింది. ప్రీవ్యూ చూసిన వాళ్లంతా సినిమా బాగాలేదని చెప్పారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక మొదటి షో నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అభిలాష అద్భుతమైన విజయం సాధించింది అని కోదండరామిరెడ్డి తెలిపారు.