MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించిన ఆ 'సంక్రాంతి' మూవీ.. పండక్కి ఎన్ని హిట్లు కొట్టాడంటే.?

చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించిన ఆ 'సంక్రాంతి' మూవీ.. పండక్కి ఎన్ని హిట్లు కొట్టాడంటే.?

Chiranjeevi: ఒక్క ఈ సంక్రాంతి మాత్రమే కాదు.. గతంలోనూ తన సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేసి ప్రేక్షకులను అలరించారు చిరంజీవి. మరి ఈ సంక్రాంతి రేసులో చిరంజీవి తన కెరీర్‌లో ఎన్ని హిట్స్ కొట్టారో ఇప్పుడు తెలుసుకుందామా.. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 11 2026, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంక్రాంతికి సినిమాల జోరు..
Image Credit : Twitter

సంక్రాంతికి సినిమాల జోరు..

ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ హీరోలు తమ సినిమాలతో సిద్దమైపోయారు. ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ 'ది రాజా సాబ్' విడుదల కాగా.. చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారి' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్..
Image Credit : Asianet News

చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్..

చిరంజీవి, సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉంది. బాక్సాఫీస్ దగ్గర ప్రతీ సంక్రాంతికి చిరంజీవి తన సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తన కెరీర్‌లో దాదాపుగా 15కిపైగా సినిమాలు సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయగా.. అందులో 70 శాతంపైగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్‌ గారు'తో వచ్చేస్తున్నారు చిరంజీవి.

35
హిట్ సినిమాలు ఇవే..
Image Credit : Asianet News

హిట్ సినిమాలు ఇవే..

1993లో 'ముఠా మేస్త్రి' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ కొట్టింది. మాస్ ఆడియన్స్‌లో చిరు ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. 1997లో 'హిట్లర్' సినిమాతో చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది. ఆపై 1999లో 'స్నేహం కోసం', 2000లో 'అన్నయ్య', 2017లో 'ఖైదీ నెంబర్ 150', 2023లో 'వాల్తేరు వీరయ్య' చిరంజీవికి సంక్రాంతి పండుగ నాడు హిట్ ఇచ్చిన చిత్రాలు.

45
ఫ్లాప్‌లు ఇవే..
Image Credit : Asianet News

ఫ్లాప్‌లు ఇవే..

2001లో 'మృగరాజు' భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. ఆపై 2004లో 'అంజి' చిత్రం గ్రాఫిక్స్‌కు ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. మొత్తానికి చిరంజీవికి సంక్రాంతి సినిమాల్లో మంచి సక్సెస్ రేటు ఉందని చెప్పొచ్చు. రాజకీయాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.

55
ఈ ఏడాది పోటీ..
Image Credit : Asianet News

ఈ ఏడాది పోటీ..

ప్రభాస్ 'ది రాజా సాబ్'తో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' ఈ సంక్రాంతికి పోటీ పడుతోంది. ఈ రెండు పెద్ద చిత్రాలు కావడంతో వీటిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టైటిల్, ట్రైలర్, దర్శకుడి ట్రాక్ రికార్డు చూస్తుంటే.. ఈ సంక్రాంతికి కూడా బాస్ మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
ప్రసిద్ధ వ్యక్తులు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు
Recommended image2
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image3
హాయ్ చెప్పడమే తప్పైందా? ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి వద్దని పారిపోయిన జంట కథ
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌ను ఎదిరించే దమ్మున్న వ్యక్తి ఆయనే.. నిజాన్ని బయటపెట్టిన బాలకృష్ణ..
Recommended image2
అభిమానులకు అక్కినేని కోడలు సూపర్ గుడ్‌న్యూస్.. పెళ్లైన ఇన్ని రోజులకు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved