- Home
- Entertainment
- టాలీవుడ్ మన్మధుడు నాగ్ బర్త్ డే... అరవైలలో ఇరవై ఏళ్ల యువకుడిలా కనిపించే ఆయన ఫిట్నెస్ రహస్యాలు తెలుసా?
టాలీవుడ్ మన్మధుడు నాగ్ బర్త్ డే... అరవైలలో ఇరవై ఏళ్ల యువకుడిలా కనిపించే ఆయన ఫిట్నెస్ రహస్యాలు తెలుసా?
60లలో 20లా కనిపించే నాగార్జున ఆరోగ్య రహస్యం తెలిస్తే షాక్ అవుతారు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ తో ఆయన యవ్వనాన్ని సొంతం చేసుకుంటున్నారు. నాగార్జున స్వయంగా చెప్పిన ఆ లైఫ్ స్టైల్ ఏమిటంటే!

Nagarjuna
కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు. 1959 ఆగస్టు 29న జన్మించిన ఆయన నేడు 63వ బర్త్ డే జరుపుకుంటున్నారు. లెజెండరీ నటుడు నాగేశ్వరరావు నటవారసుడిగా తెరంగేట్రం చేసిన నాగ్ స్టార్ గా ఎదిగారు. 80, 90 లలో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెండితెర రొమాన్స్ కురిపించాడు.
Nagarjuna
ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. అన్నింటికీ మించి నాగార్జున ఫిట్నెస్, హ్యాండ్ సమ్ విషయంలో ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాడు. నాగార్జునకు అరవై ఏళ్ళు అంటే నమ్మడం కష్టమే. కొడుకులు నాగ చైతన్య, అఖిల్ పక్కన నిలుచుంటే అన్నదమ్ములు వలె ఉంటారు.
Nagarjuna
40 ఏళ్లకే వృద్ధాప్యం మీద పడిపోతున్న రోజుల్లో నాగార్జున అంత యవ్వనంగా కనిపించడానికి కారణం ఏమిటీ? చాలా సందర్భాల్లో నాగార్జున తన ఫిట్నెస్ రహస్యం చెప్పారు. అదేమిటో తెలుసుకుందాం..
Nagarjuna
క్రమశిక్షణతో కూడిన వ్యాయాయం, ఆహారపు అలవాట్లు నాగార్జునను ఎవర్ గ్రీన్ మన్మథుడుగా మార్చాయి. నాగార్జున దిన చర్య ఉదయం 6 గంటలకు వ్యాయామంతో ప్రారంభం అవుతుంది. జిమ్ ముగిసిన వెంటనే ఎగ్ వైట్, బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. మరలా ఉదయం 11 గంటలకు ఇడ్లీ, పొంగల్, దోస వంటి సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు.
Nagarjuna
ఇక మధ్యాహ్నం లంచ్ లో నాలుగు రకాల కూరలతో అన్నం, రోటీ తీసుకుంటారు. లంచ్ కి ముందు తాజా పండ్లు తింటారు. సాయంత్రం 7 గంటలకే ఆయన డిన్నర్ ముగుస్తుంది. డిన్నర్ లో గ్రిల్డ్ చికెన్ లేక ఫిష్ తో కలిపి ఉడికించిన వెజిటబుల్స్ తింటారు. రాత్రి 10 గంటలకు నిద్రపోతారు. అర్ధరాత్రి వరకు ఫోన్ చూడటం, సినిమాలు చూడడం చేయరు. పడుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు.
వారంలో ఆరు రోజులు ఖచ్చితంగా వ్యాయాయం చేస్తారు. ఎన్ని కార్యక్రమాలున్నా నాగార్జున దిన చర్యలో ఎలాంటి మార్పులు ఉండవు. అన్నింటికీ మించి నాన్న నుండి వచ్చిన వారసత్వం తన ఆరోగ్యంతో పాటు అందం రహస్యం అని నాగార్జున గర్వంగా చెబుతారు.