జక్కన్నకు ఇష్టమైన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నటనను అభిమానిస్తాడట..
SS Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ఎస్ రాజమౌళి. వరుస హిట్లతో దూసుకుపోతున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.?

స్టార్ డైరెక్టర్లలో ఒకరు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటిదాకా.. ఆయన చేసిన ప్రతీ మూవీ సూపర్ హిట్. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఆయన మూవీలో చిన్న రోల్ అయినా కూడా నటించాలని భావిస్తారు. అంతటి పాన్ ఇండియా క్రేజ్ రాజమౌళిది.
వారణాసి మూవీ..
జక్కన్న చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. పలు అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కలిసి 'వారణాసి' మూవీ చేస్తున్నారు.
వీరి నటన చాలా ఇష్టం..
దర్శకుడు రాజమౌళి తన కెరీర్‌లో ఎన్నో స్టార్ నటీనటులతో కలిసి పని చేశారు. ఎంతమందితో పని చేసినా.. ఆయనకు సావిత్రి, సూర్యకాంతం నటన అంటే చాలా ఇష్టం. అలాగే యంగ్ స్టార్స్‌లో మాత్రం జక్కన్నకు ఓ యంగ్ హీరోయిన్ నటనను అభిమానిస్తాడట.
ఆమె మరెవరో కాదు..
నాగార్జున హీరోగా నటించిన 'రాజన్న' చిత్రం మీకు గుర్తుందా.? ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది 'యాని'. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్‌ను రాజమౌళి డైరెక్ట్ చేశారట.
యానీ నటనకు ఫిదా..
రాజన్న చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన యానీ నటనకు తాను ఫిదా అయినట్టు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఓ పెద్ద సీన్‌లో చాలా ఈజీగా యానీ నటించిందని.. ఆమె కళ్లతోనే ఎమోషన్స్ పలికించిందని రాజమౌళి అన్నారు.

