- Home
- Entertainment
- Allu Arjun:అల్పాహారంలో గుడ్లు, ఖాళీ కడుపుతో 45నిమిషాల పరుగు... అల్లు అర్జున్ టాప్ ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్డ్
Allu Arjun:అల్పాహారంలో గుడ్లు, ఖాళీ కడుపుతో 45నిమిషాల పరుగు... అల్లు అర్జున్ టాప్ ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్డ్
స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ లో ఎదిగిన తీరు అద్భుతం. గాడ్ ఫాదర్స్ ఉన్నప్పటికీ స్టార్ కావాలంటే ప్రేక్షకుల అంగీకారం తప్పనిసరి. ఎంత పెద్ద స్టార్ వారసుడైనా విషయం లేకపోతే ఫేడ్ అవుట్ కావలసిందే. తనకంటూ ఓ ప్రత్యేకత లేకుంటే విజయాలు దక్కవు.

లుక్స్ పరంగా యావరేజ్ మార్క్స్ కూడా పొందని అల్లు అర్జున్ తన డాన్స్ తో స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ డాన్సర్స్ టాలీవుడ్ హీరోలలో ఉన్నారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. తన బలాన్ని మరింత మెరుగుపరుచుకుని, బలహీనతలు అధిగమిస్తూ స్టార్ అయ్యారు. పుష్ప మూవీతో ఆల్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్, కథకు తగ్గట్లు తన శరీరాన్ని మార్చుకుంటాడు. పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు. అప్పటికి మన స్టార్స్ ఎవరూ చొక్కా విప్పలేదు. బాలీవుడ్ లో ఉన్న సిక్స్ ప్యాక్ ట్రెండ్ బన్నీనే ఫస్ట్ ట్రై చేశారని చెప్పొచ్చు. ఎదగాలనే తపన, ఫ్యాన్స్ ని అలరించాలనే బాధ్యత అల్లు అర్జున్ ని అలా మార్చింది.
అలాంటి అల్లు అర్జున్ (Allu Arjun fitness secrets)... ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆయన అభిమానుల కోసం అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అల్లు అర్జున్ వారంలో కనీసం మూడు రోజులు వర్క్ అవుట్స్ చేస్తారట. ఇక షూటింగ్స్ లేనప్పుడు విరామ సమయంలో ఏడు నుండి తొమ్మిదిసార్లు వర్క్ అవుట్స్ చేస్తారట. ఇది ఆయన షూటింగ్ షెడ్యూల్స్ పై ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యకరమైన, తాజా, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తప్పనిసరిగా తింటారు. చాక్లెట్స్ అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. ఓ చాకో బార్ తినడంతో తన రోజు ముగుస్తుంది.
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, శక్తి కోసం కొన్ని కఠిన కసరత్తులు చేస్తారు. పుష్ అప్స్, చిన్ అప్స్, డిప్స్ తన వ్యాయామంలో భాగంగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ట్రెండ్ మిల్ పై ఖాళీ కడుపుతో 45 నిమిషాలు నిరవధికంగా రన్నింగ్ చేస్తారు. తన ఫిట్నెస్ కి ప్రధాన కారణంగా బన్నీ దీనిని చెబుతారు.
ఇక ఎప్పుడైనా అధికంగా తిన్నారని భావిస్తే... సదరు ఎక్స్ట్రా క్యాలరీస్ కరిగించడానికి జిమ్ లో ఎక్కువ సమయం కసరత్తులు చేస్తారు. ఇక చీట్ మీల్ గురించి చెప్పాలంటే.. అది ఆయన చేసే సినిమాపై ఆధారపడి ఉంటుంది. పాత్ర కోసం బరువు పెరగాలనుకుంటే కొంచెం అధిక ఆహారం తీసుకుంటారు.
పుష్ప (Pushpa)మూవీలో కూలీగా కనిపించడం కోసం జుట్టు, గడ్డం విపరీతంగా పెంచిన అల్లు అర్జున్... శారీరకంగా సన్నబడ్డారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. రూ. 326 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి రికార్డులకెక్కింది.