లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ఐదు మైండ్ బ్లోయింగ్ డిటైల్స్...!
Vijay devarakonda లైగర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది యంగ్ బ్యూటీ అనన్య పాండే. సినిమా విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకుల క్రేజీ హీరోయిన్ గా మారిన అనన్య గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్.
ఏళ్లుగా తపస్సు చేసినా రాని ఫేమ్ కొందరికి ఓవర్ నైట్ లో వచ్చేస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది Ananya pandey . టైగర్ ష్రాఫ్ హీరోగా 2019లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట దిశా పటాని, సారా అలీ ఖాన్ పేర్లు పరిశీలించారట.
అనన్య పాండే కి ఫ్యాషన్ పై మంచి నాలెడ్జ్, గ్రిప్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో అనన్య పంచుకునే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. అనన్య పాండేకు ఇంస్టాగ్రామ్ లో 20మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
ప్యారిస్ లో జరిగే ప్రతిష్టాత్మక బాల్ డే డెబ్యూటెంట్స్ ఈవెంట్ లో అనన్య కజిన్ అహన పాండేతో పాటు పాల్గొన్నారు. ప్రపంచంలో గల కొన్ని ఉన్నత కుటుంబాలకు చెందిన 16-25 ఏళ్ల మధ్య వయసు కలిగిన అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొనే ఫ్యాషన్ షో ఇది. ఈ ఈవెంట్ కి అనన్య ఎంపిక కావడం జరిగింది.
ఇక అనన్య పాండే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే... షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ కూతురు షనయ ఆమెకు బెస్ట్ బడ్డీస్. అనన్య చుంకీ పాండే కూతురు అన్న విషయం తెలిసిందే. ఆయన Prabhas సాహో చిత్రంలో మెయిన్ విలన్ గా చేశారు.
అనన్య పాండే వెండితెర ఎంట్రీ వెనుక షారుక్ ఖాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతారు. నిజానికి షారుక్ ఆమెకు కేవలం మెంటార్ మాత్రమే. హీరోయిన్ కావాలనే ఆశయంతో అనన్య డాన్స్, నటనలో చాలా కాలం శిక్షణ తీసుకున్నారు.
Also read హెడ్స్ అండ్ టేల్స్ మూవీ రివ్యూ ... భగవంతుడిగా సునీల్ చెప్పిన ముగ్గురు ఆడవాళ్ళ కథ ఎలా ఉంది
Also read ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ ఘాటు వ్యాఖ్యలు