రామ్ చరణ్ కథను విజయ్ దేవరకొండ చేశాడా? కింగ్డమ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండకు కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈసినిమా కథ రౌడీ హీరోది కాదు, రామ్ చరణ్ కోసం రాసుకున్నదని రూమర్స్ టాలీవుడ్ లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు నిర్మాత.

విజయ్ దేవరకొండకు కాస్త ఊరట.
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కింగ్డమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ శ్రీలంక నేపథ్యంలో , ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీగా రూపొందింది. ఇందులో విజయ్ దేవరకొండకి సోదరుడిగా నటుడు సత్యదేవ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా.. విజయ్ దేవరకొండకు ఊరటనిచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న విజయ్ కు ఈసినిమా ఊపిరి పీల్చుకునేలా చేసింది. డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ థియేటర్లలో కొనసాగుతోంది కింగ్డమ్. ఈక్రమంలో ఈసినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
KNOW
రామ్ చరణ్ కోసం రాసిన కథలో విజయ్ దేవరకొండ?
కింగ్డమ్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే టాలీవుడ్ లో కాస్త చర్చకు దారితీసిన విషయం ఏంటటే.. ఈ కథ మొదట రామ్ చరణ్ కోసం రాశారు, ఆయన నో చెపితే అది విజయ్ దగ్గరకు వెళ్లిందనే రూమర్ బాగా స్ప్రెడ్ అయ్యింది. ఈ కథ తనకు సూట్ అవ్వదని చరణ్ ఈసినిమాను వదులుకున్నాడన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కింగ్డమ్ ప్రెస్ మీట్ లో కూడా ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించారు. దీనిపై కింగ్డమ్ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
కింగ్డమ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
ప్రచారంలో ఉన్న వార్తలు నిజమేనా అన్న ప్రశ్నకు స్పందించిన నాగవంశీ, "కింగ్‌డమ్ కథ విజయ్ దేవరకొండ కోసం రాసినదే. రామ్ చరణ్ కోసం గౌతమ్ తిన్ననూరి వేరే కథను తయారు చేశారు. అది చర్చల దశను దాటలేదు. ప్రస్తుత కథకు చరణ్‌కు ఎలాంటి సంబంధం లేదు," అని స్పష్టంగా చెప్పారు.చరణ్ కోసం రాసిన కథపై గౌతమ్‌తో కొంతకాలం చర్చలు జరిగిన మాట వాస్తవమే కానీ, అది పూర్తిగా వేరే ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. అయితే అప్పట్లో చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా, గౌతమ్ కథలోనూ పోలీస్ పాత్ర ఉండటంతో, ఆడియన్స్‌కు రిపిటేషన్ అనిపిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కథకు నో చెప్పారని గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.
కింగ్డమ్ కు పాజిటీవ్ టాక్
కింగ్డమ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. భారీగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు టీమ్. అయితే రిలీజ్ తరువాత ఈసినిమా బ్లాక్ బస్టర్ టాక్ లేకపోయినా.. పాజిటీవ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి తరువాత ఆ తరహా పాత్రను విజయ్ చేయడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఫైనల్ రన్ లో ఈసినిమా ఎంత కలెక్ట్ చస్తుందో చూడాలి. గీతా ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.