MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • kichcha Sudeep: శివన్నను అడగరెందుకు? నెపోటిజం ప్రశ్నలపై కిచ్చా సుదీప్ ఫైర్

kichcha Sudeep: శివన్నను అడగరెందుకు? నెపోటిజం ప్రశ్నలపై కిచ్చా సుదీప్ ఫైర్

kichcha Sudeep: నటుడు కిచ్చా సుదీప్ తన మేనల్లుడు సంచిత్ 'మ్యాంగో పచ్చా' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా నెపోటిజంపై విలేకరి అడిగిన ప్రశ్నకు సుదీప్ ఘాటుగా స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెపోటిజం ప్రశ్నపై సుధీర్‌ ఫైర్‌
Image Credit : youtube/colors kannada

నెపోటిజం ప్రశ్నపై సుధీర్‌ ఫైర్‌

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనే మాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో అమ్మానాన్నలు నటులైతే పిల్లలకు సులువుగా అవకాశాలు వస్తాయని, ఇతరులు ఎదగడం కష్టమనే వాదన ఉంది. ఇది టాలీవుడ్‌లో ఉంది, బాలీవుడ్‌లో ఉంది, కోలీవుడ్‌ ఉంది. కన్నడలోనూ కొనసాగుతుంది. తాజాగా ఇదే ప్రశ్న `ఈగ` ఫేమ్‌ కిచ్చా సుదీప్‌కు ఎదురవగా, ఆయన కాస్త ఘాటుగానే బదులిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 మేనళ్లుడు సంచిత్‌ హీరోగా `మ్యాంగో పచ్చా` మూవీ
Image Credit : Social Media

మేనళ్లుడు సంచిత్‌ హీరోగా `మ్యాంగో పచ్చా` మూవీ

సుదీప్ అక్క కొడుకు సంచిత్ 'మ్యాంగో పచ్చా' సినిమాతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేకరి సుదీప్‌ను నెపోటిజం గురించి ప్రశ్నించారు. ఇది సహజంగానే సుదీప్‌కు కోపం తెప్పించింది.
35
ఈ ప్రశ్న శివరాజ్‌ కుమార్‌ని ఎందుకు అడగరు ?
Image Credit : Instagram

ఈ ప్రశ్న శివరాజ్‌ కుమార్‌ని ఎందుకు అడగరు ?

"ఈ ప్రశ్న నన్నే ఎందుకు అడుగుతారు? ఇదే ప్రశ్నను శివరాజ్‌కుమార్‌ను అడుగుతారా?" అని సుదీప్ ఎదురు ప్రశ్నించారు. "నెపోటిజం  రాజ్‌కుమార్ కాలం నుంచే మొదలైంది కదా. మరి వాళ్లను ఎందుకు అడగరు? రాజ్‌కుమార్ పిల్లలను, అంబానీని కూడా అడగాలి. మీరెందుకు అలా చేయరు?" అని ప్రశ్నించారు. `బాంబేలో పుట్టిన 'నెపోటిజం' అనే పదాన్ని ఇక్కడ వాడటం తప్పు. అణ్ణావ్ర(రాజ్‌ కుమార్‌) కాలం నుంచే ఇది ఉంది. ఎవరి పిల్లలకు కళ అబ్బుతుందో, ఎవరిని ప్రజలు చూడటానికి ఇష్టపడతారో వాళ్లే ఇండస్ట్రీకి వస్తారు. కన్నడ ప్రజలు ఇష్టపడితే చాలు. ఇది ఎవరి స్థానమైనా కావచ్చు` అని సుదీప్ తన మాటకు స్పష్టత ఇచ్చారు.

45
పునీత్‌ రాజ్‌ కుమార్‌ గొప్ప నటుడు
Image Credit : Colors

పునీత్‌ రాజ్‌ కుమార్‌ గొప్ప నటుడు

"ఈ రోజు శివన్న (శివరాజ్‌కుమార్) ఒక గొప్ప నటుడిగా ఎదిగారు. మేము ఆయన నుంచి స్ఫూర్తి పొంది పెరిగాం. అప్పు (పునీత్ రాజ్‌కుమార్) ఎంత అద్భుతమైన ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. వీటికి నెపోటిజం అనే మాట రాకూడదు. వాళ్ల నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు` అని సుదీప్ అన్నారు.

55
నెపోటిజం మాకు సెట్‌ కాదు
Image Credit : Kichcha Sudeepa

నెపోటిజం మాకు సెట్‌ కాదు

`మా ఇంటి నుంచి సంచిత్ వచ్చాడు. వాడు తప్ప నా కజిన్స్ పిల్లలు, అక్క పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎవరూ సినిమాల్లోకి రాలేదు. నా కూతురు బాగా పాడుతుంది, అందుకే వచ్చింది. సంచిత్‌కు నటనపై ఆసక్తి ఉంది, అందుకే వచ్చాడు. 'నెపోటిజం' అనే పదం చాలా ఏళ్లుగా మాకు సూట్ కాదు. కొందరికి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. తెలిసింది కళ మాత్రమే" అని కిచ్చా సుదీప్ సూటిగా సమాధానమిచ్చారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image3
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Pavitra Lokesh: అది పెళ్లి కాదు నరకం.. పవిత్ర లోకేష్‌ మొదటి పెళ్లి గుట్టు విప్పిన తల్లి, తెరవెనుక ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved