- Home
- Entertainment
- టాప్ అందాలతో అట్రాక్ట్ చేస్తున్న కియారా అద్వానీ.. మత్తెక్కించే చూపులకు చిత్తవుతున్న కుర్రాళ్లు..
టాప్ అందాలతో అట్రాక్ట్ చేస్తున్న కియారా అద్వానీ.. మత్తెక్కించే చూపులకు చిత్తవుతున్న కుర్రాళ్లు..
యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ వరుస సినిమాలతో జోరు పెంచుతోంది. తను నటించిన హిందీ చిత్రం ‘భూల్ భూలయ్య 2’ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోందీ బ్యూటీ.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను నటిస్తోంది. తను తాజాగా నటించినచిత్రం ‘భూల్ భూలయ్యా’ (Bhool Bhulaiyaa 2). ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఈ హారర్ మరియు కామెడీ చిత్రం భూల్ భూలయ్య నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే లభిస్తోంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను యూనిట్ తాజాగా ప్రారంభించింది.
గురువారం ముంబైలోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ కియారా అద్వానీ, హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రొగ్రామ్ లో అట్రాక్టివ్ గా నిలిచారు.
మరోవైపు కియారా భూల్ భూలయ్య చిత్ర ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మతిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఈ సందర్భంగా ఇన్ స్టాలో తను తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కియారా బ్లూ డెనిమ్ హై-వెయిస్ట్ ప్యాంట్ మరియు క్రిస్-క్రాస్ హాల్టర్-నెక్ క్రాప్ టాప్‌లో అట్రాక్ట్ చేస్తోంది. ఎద అందాలతో మతిపోగొట్టింది. గ్లామర్ ధాటితో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పిక్స్ కు ‘ఫ్యాషన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిందీ సుందరి.
మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కియాారా. ఆ సినిమా హిట్ కావడంతో వెంటనే రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో ఛాన్స్ కొట్టేసి.. తెలుగు ఆడియెన్స్ అలరించింది. చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ ఆర్సీ 15లో మరోసారి చెర్నీ (Ram Charan) సరసన నటిస్తోంది.