- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: తల్లితండ్రుల గురించి భయపడుతున్న ఖుషి.. వేదకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యష్!
Ennenno Janmala Bandham: తల్లితండ్రుల గురించి భయపడుతున్న ఖుషి.. వేదకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఖుషి (Khushi) వాళ్ల తల్లిదండ్రులు గొడవ పడుతున్నందుకు విడిపోతారేమో అని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన ఖుషి పెద్దమ్మ ఖుషి కి అనేక రకాలుగా నచ్చ చెబుతుంది. మరోవైపు యష్ (Yash) చిత్ర కాదు నిధి నే వసంత్ భార్య అని అంటాడు.
ఇక ఈ లోపు యష్ (Yash) దగ్గరకి ఖుషి అలుగుతూ వస్తుంది. ఇక యష్ ఖుషికి డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ఖుషి ను ఐస్ చేస్తాడు. ఈ క్రమంలో ఆనందంగా యష్ ఖుషి దగ్గర ఒక ముద్దు కూడా తీసుకుంటాడు. ఇక ఖుషి (Khushi) మమ్మీ కి కూడా ఒక గిఫ్టు ఇవ్వు డాడీ అని యష్ ను ఒప్పిస్తుంది. దానికి యష్ కూడా ఒకే చెబుతాడు.
ఇక ఆ తర్వాత యష్ (Yash) నేను నీకు గిఫ్ట్ ఇచ్చేది నిన్ను మెప్పించడానికి కాదు. నా కూతురిని నొప్పించకుండా ఉండటానికి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు చిత్ర నిధి పై కారాలు మిరియాలు నూరు కుంటూ ఉంటుంది. ఇక వసంత్ (Vasanth) ఇద్దరు కలిసి నన్ను మధ్యలదరువు వాయిస్తున్నారు అని చిరాకు పడుతూ ఉంటాడు.
మరోవైపు యష్ (Yash) వేద కు గిఫ్ట్ ఇవ్వడానికి నసుకుతూ ఉంటాడు. ఒక వైపు ఖుషిని మాలిని (Maalini) దంపతులు చూసుకుంటూ ఉంటారు. ఇక యష్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యు అని వేద తో అంటాడు. దానితో వేద ఒకసారి గా స్టన్ అవుతుంది. అంతేకాకుండా ఏంటి.. తమరు నాకు గిఫ్ట్ ఇవ్వడమా అంటూ నవ్వుకుంటూ ఉంటుంది.
ఇక వేద (Vedha) ఆ గిఫ్ట్ ను తీసుకొని ఓపెన్ చేయగా అందులో స్టేతస్ స్కోప్ ఉంటుంది. అది చూసి అందరు ఒక్క సరిగా ఫన్నిగా నవ్వు కుంటారు. ఇక మాలిని (Maalini) దంపతులు వాళ్ళ దగ్గరకి వచ్చి నువ్వు వేదకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చిన ఆలోచన గ్రేట్ అని క్లాప్స్ కొడతారు.
ఇక తర్వాతి భాగంలో ఖుషి (Khushi) లేకపోతే నువ్వు నా భార్య కాదు అని యష్ వేదతో అంటాడు. ఇక వేద (Vedha) కూడ ఖుషి గురించే నేను కూడా నీ భార్య గా ఉన్నాను అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూడాలి.