- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: వేదను పెళ్లి చేసుకోబోయేది యష్ అని తెలుసుకున్న ఖుషీ.. ఏం చేసిందంటే?
Ennenno Janmala Bandam: వేదను పెళ్లి చేసుకోబోయేది యష్ అని తెలుసుకున్న ఖుషీ.. ఏం చేసిందంటే?
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అయితే ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏంటో తెలుసుకుందాం. సులోచన ఖుషి కి లడ్డు లు పెడుతూ.. ప్రేమగా ముద్దులు పెడుతూ ఉంటుంది. అది చూసిన వేద (Veda) అమ్మ కాస్త అమ్మమ్మ అయిపోయింది అని మనసు లో ఆనందంగా అనుకుంటుంది.

ఇక వేద (Veda) తాను పెళ్లి చేసుకునేది ఖుషి వాళ్ళ డాడీ అని చెప్పి సంతోషపెట్టడానికి చూస్తుంది. ఇక వేద, ఖుషి కు సర్ప్రైజ్ రూపంలో ఆ విషయాన్ని చెబుతూ ఉండగా ఈలోపు సులోచన, వేదను పిలుస్తుంది. ఆ తర్వాత ఖుషి, యశోదర్ (Yasodar) ఒక దగ్గర ఫోన్ మాట్లాడుతుండగా వెనక నుంచి వెళ్లి 'పెళ్ళికొడుకు అంకుల్ నమేస్తే మీరు మా ఫ్రెండ్ వేదాన్ని పెళ్లి చేసుకోకండి మీరు వేరే ఎవరైనా పెళ్లి చేసుకోండి'. అని వేద వేడుకుంటుంది.
ఇక ఆ మాటలు వినుకుంటూ ఉన్న యశోదర్ (Yasodar) అలానే వెనక్కి తిరిగి ఉంటాడు. ఇక అలానే పలు ముద్దు ముద్దు మాటలతో ఖుషి యశోదర్ ను పెళ్లి కొడుకు అనుకోని ప్రతి మాట్లాడుతుండగా యశోద ఎమోషనల్ అవుతాడు. అంతేకాకుండా ఖుషి (Khushi) కూడా ఏడుస్తుంది.
ఇక యశోదర్ (Yasodar) వెనుకకు తిరిగి ఖుషి ముందుకి వెళ్లి నీ ఫ్రెండు వేదా ని పెళ్లి చేసుకునేది వేరెవరో కాదు అమ్మ నేను అని చెబుతాడు. దాంతో ఖుషి ఆనందంతో గంతులు వేస్తుంది. ఇక యశోదర్ ఈ విషయాన్ని మాళవిక కు చెప్పొద్దూ అని ఖుషి (Khusi) తో మాట తీసుకుంటాడు.
ఆ విషయం తెలిసిన ఖుషి , వేద (Veda) దగ్గరకి వెళ్లి అమ్మ అని పిలువ గా వేద ఎంతో సంతోషిస్తుంది. తర్వాత ఖుషి 'మా ఫ్రెండ్ ఏ మా మమ్మీ అంటూ ఆనందంతో చిందులు వేస్తుంది. దాంతో వేద, ఖుషి (Khushi) ను ప్రేమగా దగ్గరకు తీసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.
ఇక మాలిని ఫ్యామిలీ కి ఖుషి (Khushi) మా మమ్మీ ని చూపిస్తా కల్లూమూసుకోండి అని చెబుతుంది. ఇక వేద (Veda) ను వాళ్ళ ముందుకు తీసుకొని వచ్చి మా మమ్మీ అంటూ.. సంతోషంగా చూపిస్తుంది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం ఖుషి తో ఆనందంగా హడావిడి చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత మాలిని (Malini) ఫ్యామిలీ మొత్తం వేద తో కలిసి షాపింగ్ కి వెళతారు. అదే షాపింగ్ మాల్ కి మాళవిక వస్తుంది. ఇక మాళవిక ఫ్రెండ్ యశోదర్ చేసుకో చేసుకోబోయే అమ్మాయి చాలా బాగుంది అని చెప్పగా మాళవిక (Malavika) ఆ అమ్మాయి ఎవరా.. అని చూడడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చుడాలి.