MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది

YouTuber Madhumita: కిలాడీ యూట్యూబర్ మధుమితపై దొంగతనం కేసు.. తెలివిగా మెడలో గొలుసు కొట్టేసింది

YouTuber Madhumita: యూట్యూబర్ మధుమిత ఈ మధ్య బాగా ట్రెండయిన పేరు. ఇన్ స్టా, యూట్యూబ్ ఖాతాలలో తమ డబ్బును, బంగారాన్ని చూపించి ఫేమస్ అయింది. ఆ బంగారం మరుసటి రోజే దొంగతనానికి గురైంది. అయితే ఇప్పుడు ఆమెపైనే బంగారం దొంగిలించిన కేసు పడింది.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 08 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారంతో వైరల్ అయిన మధుమిత
Image Credit : Madhumitha/Instagram

బంగారంతో వైరల్ అయిన మధుమిత

ప్రముఖ యూట్యూబర్ మధుమిత పేరు గుర్తుపట్టకపోయినా ఆమెను చూస్తే మాత్రం ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. మెడ నిండగా బంగారు ఆభరణాలోత, చేతిలో డబ్బు కట్టలతో ఆమె ఎన్నో రీల్స్ చేసింది. మంచంమంతా డబ్బులు పరిచి ఆమె చేసిన రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె పై బంగారు గొలుసు చోరీ కేసు నమోదైంది. 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ పెచ్చిముత్తు ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో తన మెడలో ఉన్న సుమారు 5 సవర్ల బంగారు గొలుసు కనిపించకుండా పోయిందని ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో మధుమితపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పాత కేసు ఇప్పుడు పెట్టారు
Image Credit : Madhumitha/Instagram

పాత కేసు ఇప్పుడు పెట్టారు

పెచ్చిముత్తుకు మధుమితతో గతంలో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో తిరునెల్వేలి కోర్టు సమీపంలో మధుమిత తన వాహనం ఎక్కిందని ఆయన చెప్పారు. అనంతరం ఆమెను బస్‌స్టాండ్ వద్ద దింపి ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదని గుర్తించారు. ఈ విషయం గురించి మధుమితను ఫోన్‌లో అడిగితే తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు తీస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

33
మధుమిత ఇంట్లోనే భారీ చోరీ
Image Credit : Madhumitha/Instagram

మధుమిత ఇంట్లోనే భారీ చోరీ

ఇదిలా ఉంటే మధుమిత ఇంట్లో జరిగిన మరో భారీ చోరీ కేసు కూడా ఇటీవల సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 24న ఆమె కుటుంబంతో బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి దుండగులు ప్రవేశించి 118 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు 89 ఏళ్ల కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదుతో మధుమితపై మరో కేసు నమోదైంది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Recommended image3
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Related Stories
Recommended image1
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image2
Amazon: అమెజాన్లో మరోసారి ఉద్యోగాల కోత.. మనదేశంలో కొంతమంది ఉద్యోగులను తీసేసిన దిగ్గజ సంస్థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved