- Home
- Entertainment
- Khiladi: చీప్ స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు.. రవితేజపై విరుచుకుపడ్డ ఖిలాడీ డైరెక్టర్ భార్య
Khiladi: చీప్ స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు.. రవితేజపై విరుచుకుపడ్డ ఖిలాడీ డైరెక్టర్ భార్య
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
చిత్ర దర్శకుడు రమేష్ వర్మకి, రవితేజకి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ పరోక్షంగా రమేష్ వర్మని ఉద్దేశిస్తూ వేసిన సెటైర్లు, కామెంట్స్ అనుమానాలకు దారి తీశాయి. దీనితో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వివాదానికి మరింత బలం చేకూర్చేలా రమేష్ వర్మ భార్య రేఖ వర్మ సోషల్ మీడియాలో రవితేజపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ దర్శకుడి వర్క్ అభినందిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను ఈ సినిమా ఒప్పుకుంది కేవలం రచయిత శ్రీకాంత్ విస్సా కోసమే అని అన్నారు. రవితేజ ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. నేను అదృష్టాన్ని నమ్ముకోను. కానీ రమేష్ వర్మని చూస్తే అదృష్టాన్ని కూడా నమ్మాలనిపిస్తోంది అని రవితేజ అన్నారు.
నిర్మాత గురించి మాట్లాడుతూ.. సర్ మీరు సెట్స్ కి తప్పకుండా రావాలి. అప్పుడే ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది అని రవితేజ సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే రమేష్ వర్మకి నిర్మాత కారు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు అని రవితేజ అన్నారు. నిర్మాత సత్యనారాయణ గారు రమేష్ వర్మకి అరటిపండు వలచి ఇచ్చినట్లు అన్నీ సమకూర్చారని రవితేజ కామెంట్స్ చేశారు.
దీనితో రమేష్ వర్మ భార్య రేఖ వర్మ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. రవితేజపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. 'దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థం ఐంది' అంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
అరటి పండు వలవడం ఆయనకు బాగా తెలుసు. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం రవితేజ దగ్గరకు క్లాస్ కి వెళ్ళండి. ఆయనకి అరటి చెట్టి నరికి ఇచ్చినా సరిపోదు అంటూ ఆమె సెటైరికల్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అసలు రవితేజ, రమేష్ వర్మ మధ్య ఏం జరిగిందో తెలియదు. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అర్థం కానీ విధంగా ఉందంటున్నారు అభిమానులు. గతంలో రవితేజ, రమేష్ వర్మ కాంబోలో వచ్చిన తొలి చిత్రం వీరా. ఆ చిత్రం కూడా నిరాశపరిచింది.