చిరంజీవితో రొమాన్స్, పెళ్లయ్యాక నా సినిమాలు నువ్వు చూడకూడదు..భర్తకి హీరోయిన్ కండిషన్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఖైదీ. ఈ చిత్రంలో చిరంజీవి నటన, కోదండరామిరెడ్డి దర్శకత్వం అద్భుతం అనే చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఖైదీ. ఈ చిత్రంలో చిరంజీవి నటన, కోదండరామిరెడ్డి దర్శకత్వం అద్భుతం అనే చెప్పాలి. ఈ మూవీలో హీరోయిన్ గా మాధవి నటించింది. చిరంజీవితో మాధవి చాలా చిత్రాలు చేసింది.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, రోషగాడు, చట్టంతో పోరాటం, ఖైదీ లాంటి చిత్రాల్లో నటించింది. ఖైదీ మూవీలో చిరంజీవి, మాధవి మధ్య రొమాన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. మాధవి మాతృదేవో భవ లాంటి క్లాసిక్ మూవీలో కూడా నటించింది. హీరోయిన్ గా వెలుగు వెలిగిన మాధవి చాలా కాలం క్రితమే సినిమాలకు దూరం అయింది. 1996లోనే ఆమె వివాహం చేసుకుని యుఎస్ లో సెటిల్ అయింది. ఆమె భర్త రాల్ఫ్ శర్మ యుఎస్ లో ఫార్మా కంపెనీ అధినేతగా వ్యాపారంలో రాణిస్తున్నారు.
మాధవి కూడా వ్యాపారంలో భర్తకి సాయం చేస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. పెళ్ళికి ముందే మాధవి తన భర్తకి కండిషన్ పెట్టిందట. అదేంటంటే.. పెళ్లయ్యాక తన సినిమాలు ఒక్కటి కూడా చూడకూడదని చెప్పిందట. ఈ విషయాన్ని మాధవి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. తన భర్తకి అలా కండిషన్ పెట్టడానికి కారణం ఉంది.
నా భర్త నన్ను సాధారణ మహిళగానే చూడాలి. ఒక వేళ అయన నా సినిమాలు చూస్తే నేను సెలెబ్రిటీ అనే ఫీలింగ్ వస్తుంది. నా భార్య సెలెబ్రిటీనా అని ఫీల్ అవుతారు. ఆ భయంతోనే నా సినిమాలు చూడకూడదు అని కండిషన్ పెట్టినట్లు మాధవి పేర్కొంది.
ఒక వేళ ఎవరైనా మీ భార్య నటించిన సినిమాలు చూశారా అడిగితే మాత్రం చూశాను అని అబద్దం చెప్పమని చెప్పిందట. కానీ మాతృదేవో భవ చిత్రాన్ని మాత్రం ఆయనకి తానే చూపించినట్లు మాధవి పేర్కొంది. ఆయన సినిమా చూస్తున్నప్పుడు నేను ముఖం దాచుకుని సిగ్గుతో కూర్చున్నా. నటిగా నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతారో అనే భయం అని చెప్పింది.
ఆ మూవీ చూశాక నువ్వు చాలా మంచి నటివి అని అభినందించినట్లు మాధవి తెలిపింది. ప్రస్తుతం మాధవి తమకి ఉన్న ఫార్మా కంపెనీలు చూసుకుంటూ బిజీగా ఉన్నారట. ఒకవైపు పిల్లలు, మరోవైపు కంపెనీ వ్యవహారాలతో బిజీగా గడుపుతున్నారు. తమ పిల్లల్లో ఒక్కరైనా చిత్ర పరిశ్రమలో నటిగా మారితే తన చాలా సంతోషం అని మాధవి పేర్కొంది.