భారీ తేడాతో RRR ని బీట్ చేయబోతున్న KGF 2.. కలిసొచ్చే అంశం అదే ?
త్వరలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కెజిఎఫ్ మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

KGF2
త్వరలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కెజిఎఫ్ మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దీనితో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 14న కేజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది.
RRR Movie
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రాఖీ భాయ్ గా మరోసారి హీరో యష్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించబోతున్నాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కెజిఎఫ్ 2 గురించే చర్చ జరుగుతోంది. కెజిఎఫ్ ని మించేలా కెజిఎఫ్ 2 ఉంటుందా ? అంచనాలని అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
RRR Movie
ఇదిలా ఉండగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం వసూళ్ళని కెజిఎఫ్ 2 అధికమిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ విషయంలో కెజిఎఫ్2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం హిందీలో తొలి రోజు 19 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కెజిఎఫ్ 2 హిందీ బెల్ట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బీట్ చేయబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
RRR Movie
అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా కెజిఎఫ్ 2 ఆర్ఆర్ఆర్ వసూళ్ళని హిందీలో తొలి రోజు అధికమించడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీలో తొలి రోజు కెజిఎఫ్ 2.. 30 కోట్ల వరకు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కెజిఎఫ్ 2కి ఒక అడ్వాంటేజ్ ఉంది. కెజిఎఫ్ చిత్రానికి ఇది సీక్వెల్.. కొనసాగింపుగా వస్తున్న చిత్రం. కెజిఎఫ్ చూసిన ప్రతి ప్రేక్షకుడు కెజిఎఫ్ 2కూడా చూడాలని భావిస్తాడు.
RRR Movie
గతంలో ఇలాగే బాహుబలి 2 కి కూడా జరిగింది. బాహుబలి 1 ఇచ్చిన హైప్ తో బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోవడం చూశాం. అలాగే హిందీ మార్కెట్ లో కెజిఎఫ్ చిత్రం మాస్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ నటులు కెజిఎఫ్ 2లో నటిస్తుండడం హిందీలో మరో అదనపు బలం అనే చెప్పాలి.
RRR Movie
మొదటి భాగం కంటే రెండవ భాగం రెట్టింపు భారీ తనంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో సహజంగానే ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 మధ్య కలెక్షన్స్ విషయంలో అభిమానుల్లో చర్చ జరుగుతోంది.