ఆ విషయంలో రాజీ పడలేం.. నైజాంలో టాలీవుడ్ గల్లంతేనా!
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో నేడు సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ చోటు చేసుకుంది. మీటింగ్ లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని సమాచారం అందుతుంది.
తెలంగాణ ప్రభుత్వం మద్దతు కోరుతూ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖులు భేటీ అయ్యారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన దర్శక నిర్మాతలు, నటుల్లో గుబులు రేపింది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవని తేల్చి చెప్పారు. స్పెషల్ షోల కారణంగానే సంధ్య థియేటర్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మృతికి దారి తీసిందని సీఎం రేవంత్ రెడ్డి గట్టినా నమ్ముతున్నారు.
కాగా మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రతినిధులకు ప్రభుత్వం తరపున కొన్ని ప్రతిపాదనలు వినిపించారు. వాటిలో ప్రధానమైనది..
శాంతిభద్రతలు:
శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ గట్టిగా చెప్పారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటన మరలా పునరావృతం కాకూడదు. ప్రజల రక్షణ మా ప్రధాన ధ్యేయం అన్నారట. అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. నివారణ చర్యలు చేపట్టాలని కోరారట.
బౌన్సర్ల పై సీరియస్
బహిరంగ ప్రదేశాల్లో సామాన్య జనం పట్ల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారట. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్నారట. సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అభిమానుల మీద దాడి చేశారు. పరోక్షంగా తొక్కిసలాటకు కారణం అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు.
అభిమానులను కూడా కంట్రోల్ చేసుకోవాలి
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం సూచనలు చేశారు. అభిమానం పేరుతో నేతలపై, ఇతర ప్రముఖులపై విమర్శల దాడి చేయడం, దూషించడం సరికాదు. అభిమానులు సోషల్ మాధ్యమాల్లో హద్దులు మీరు ప్రవర్తించకుండా, పబ్లిక్ లో న్యూసెన్స్ చేయడకుండా హీరోలు అభిమానులకు హితబోధ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమకు భరోసా
ప్రభుత్వం ఇండస్ట్రీతో ఎప్పుడూ ఉంటుంది. తమ వైపు నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారట. పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారట.
తెలంగాణ అభివృద్ధికి పరిశ్రమ సహకారం
అలాగే తెలంగాణ అభివృద్ధికి చిత్ర పరిశ్రమ సహకారం అందించాలి. ఈ అంశాన్ని ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీగా తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలు పాటించాలని సూచించారట.
నో డ్రగ్ క్యాంపైన్
హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా స్టార్స్ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ లో పాల్గొనాలి. యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా అవగాహన కల్పించాలి. అలాగే మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలన్నారట.
తెలంగాణ టూరిజం పై దృష్టి
చిత్ర పరిశ్రమ తెలంగాణ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని టాలీవుడ్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశాడట.
పెట్టుబడులు
తెలంగాణ స్టేట్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం ద్వారా పెట్టుబడులు రాబట్టాలి ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ ప్రముఖులను కోరారట.
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిషేధం.
సినిమాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సినిమా ద్వారా వాటిని ప్రోత్సహించకూడదు. సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతి స్టార్ డ్రగ్స్ కు వ్యతిరేకం గా వీడియో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.
అయితే అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లు తెలిపారట. ఇకపై తెలంగాణ రాష్ట్రలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదు అన్నారట. ప్రజల భద్రత విషయంలో రాజీ పడలేమని గట్టిగా చెప్పారట. టికెట్స్ ధరల పెంపు పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతికూలంగా స్పందించారు. టికెట్స్ ధరల పెంపు ఉండదని తేల్చేశారు. ఆ విషయంలో కూడా టాలీవుడ్ పెద్దలకు నిరాశ ఎదురైందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో టాలీవుడ్ కి గడ్డుకాలం మొదలైందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
మరోవైపు సినీ ప్రముఖుల అభిప్రాయాలు, ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున వెల్లడించారు.
ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ అన్నారు
నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రతిపాదించారు.
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు..
హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలని సురేష్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ గుర్తు చేశారు.
మరోవైపు సినీ ప్రముఖుల అభిప్రాయాలు, ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున వెల్లడించారు.
ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ అన్నారు.
నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రతిపాదించారు.
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు..
హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలని సురేష్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ గుర్తు చేశారు.