పెళ్లి విషయంలో సమంతని ఫాలో అవుతున్న కీర్తి సురేష్.. ఎందుకో తెలుసా, గోవాలో అంతా రెడీ..
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ 32 ఏళ్ళ వయసులో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది.
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ 32 ఏళ్ళ వయసులో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఆంటోని తట్టిల్ అనే చిన్ననాటి స్నేహితుడిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆంటోని, కీర్తి సురేష్ ఇద్దరూ స్కూల్ లో క్లాస్ మేట్స్ అట.
ఇటీవల వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యల అంగీకారంతో డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆంటోని రిసార్ట్స్ బిజినెస్ లో రాణిస్తున్నారట. అయితే కీర్తి సురేష్ తన పెళ్లి విషయంలో సమంతని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సమంత, చైతన్య వివాహం కూడా గోవాలోనే జరిగింది.
అంత కాదు సమంత, చైతన్య ఇద్దరూ మొదట హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్, ఆంటోని పెళ్లి కూడా అదే విధంగా జరగబోతోంది.
డిసెంబర్ 12 న వివాహం జరగబోతోంది. 10 వ తేదీన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలవుతాయి. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అనేది ఇప్పుడే తెలియదు. కీర్తి సురేష్.. మేనకా సురేష్, సురేష్ కుమార్ దంపతుల సంతానం. మేనకా సురేష్ అప్పట్లో నటిగా రాణించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పున్నమినాగులో హీరోయిన్ గా నటించింది మేనకనే.