కీర్తి సురేష్ పెళ్ళితో రజినీకాంత్ కి లింక్, ఇంట్రెస్టింగ్ స్టోరీ
నటి కీర్తి సురేష్ డిసెంబర్‌లో ఆంటోనీ థట్టిల్‌ని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కాగా పెళ్లి కార్డు లీక్ అయ్యింది.ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.
కీర్తి సురేష్ ప్రియుడు ఆంటోనీ థట్టిల్ ఎవరు?
లీకైన పెళ్లి కార్డు ప్రకారం, నటి కీర్తి సురేష్ డిసెంబర్ 12న ఆంటోనీ థట్టిల్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్‌కి చాలా ప్రత్యేకమైనది. రజినీకాంత్ జన్మదినం కాగా 74వ ఏట అడుగుపెట్టనున్నారు. రజినీకాంత్ బర్త్ డే వేళ పెళ్లి చేసుకుంటున్న కీర్తి సురేష్ కి ఆయా అభిమానుల నుండి కూడా ఆశీస్సులు దక్కుతున్నాయి.
పెళ్లి దగ్గర పడుతుండగా, వారి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో 'లీక్' అయింది. కీర్తి సురేష్ పెళ్లి కార్డ్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆమె ఫ్యాన్స్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు ప్రకారం, కీర్తి సురేష్ డిసెంబర్ 12న పెళ్లి చేసుకుంటుంది. ఆహ్వాన పత్రికలో కీర్తి సురేష్ తల్లిదండ్రులు జి. సురేష్ కుమార్, మేనక సురేష్ సంతకం చేశారు.
మీడియా కథనాల ప్రకారం, ఆంటోనీ థట్టిల్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. అతను కొచ్చిలో రిసార్ట్స్ నడుపుతున్నాడు. వ్యాపారంలో నిష్ణాతుడు అట. అపార అనుభవం ఉందట.
కీర్తి సురేష్ ఇటీవల తనకు కాబోయే భర్త, ఆంటోనీ థట్టిల్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమది, 15 సంవత్సరాల బంధం అని వెల్లడించారు. గతంలో ఓ రిసార్ట్స్ యజమానితో కీర్తి సురేష్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. మీడియా కథనాల్లో చెప్పిన ఆ ప్రియుడు ఆంటోని అని తెలుస్తుంది.
కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె నటించిన నేను శైలజ, మహానటి, సర్కారు వారి పాట, దసరా విజయాలు సాధించాయి. కీర్తి సురేష్ పెళ్లి విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.