- Home
- Entertainment
- ట్రెండీ సూట్ లో కీర్తి సురేశ్ అల్ట్రా స్టైలిష్ పోజులు.. గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కు కుర్రాళ్లు ఫిదా
ట్రెండీ సూట్ లో కీర్తి సురేశ్ అల్ట్రా స్టైలిష్ పోజులు.. గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కు కుర్రాళ్లు ఫిదా
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ పోజులతో మతిపోగొడుతోంది. తను తాజాగా నిర్వహించిన ఫొటోషూట్ ఆకట్టుకునేలా ఉంది.

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫ్యాషన్ టేస్ట్ ను నెటిజన్లను రుచిచూపిస్తోంది. ఎప్పుడూ ట్రెడిషన్ వేర్ లో ఫొటోషూట్లు చేసే ఈ సుందరి కాస్తా రూట్ మార్చి మతిపోగొడుతోంది.
దర్శకుడు పరశురామ్ పెట్ల, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. మే 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలెట్టారు. గత కొద్ది రోజులు వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకుంటూ వస్తున్న కీర్తి ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది.
దీంతో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కీర్తి సురేష్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు క్రేజీ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తోంది. తాజా ఫొటోల్లో కీర్తి సురేష్ స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది.
లేటెస్ట్ ఫొటోల్లో కీర్తి బ్లూ సూట్, రోల్ గోల్డ్ చైన్స్ ధరించి స్టైలిష్ గా ఆకర్షిస్తోంది. చైర్ పై సిట్టింగ్ పోజులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లకే అసూయ పుట్టేలా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ సుందరి.
తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫొటోలకు ‘హోప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అట్రాక్టివ్ అవుట్ ఫిట్ లో కొత్తదనం చూపిస్తున్న కీర్తి ఫొటోషూట్లకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో పొగడ్తలతో ముంచెతున్నారు.