Keerthy Suresh : అభిమానికి క్షమాపణ చెప్పిన కీర్తి సురేష్... ఎందుకంటే?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఆమె అభిమానులకూ ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. అలాంటిది తనే అభిమానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది.
మహానటి కీర్తి సురేష్ Keerthy Suresh ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ కాస్తా తక్కువ సమయమే కనిపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ ను అందించడంలో నిమగ్నమవుతున్నారు.
ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా నుంచే వెండితెరపై అలరిస్తూ వస్తోంది. మలయాళం చిత్రాలతో అలరించింది. తర్వాత తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఇక్కడ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ (Keerthy Suresh) తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. దీంతో కీర్తికి సౌత్ లో అన్నీ భాషల ఆడియెన్స్ నుంచి మాసీవ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే, కీర్తి సురేష్ కు ఆమె డైహార్ట్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికన సందేశాలు పంపుతూనే ఉంటారు. కీర్తి కూడా రిప్లై ఇస్తూనే ఉంటుంది. కానీ రీసెంట్ గా మాత్రం ఓ అభిమానిని నెగ్లెక్ట్ చేసింది.
కృష్ణ అనే వీరాభిమాని కీర్తికి ట్వీటర్ లో 233 లేఖలు రాశాడు. తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. అభిమాన హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పుడు రిప్లై ఇస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
మొత్తం 234వ సారి కీర్తి రిప్లై ఇచ్చింది. అయితే, ఇంత ఆలస్యంగా రిప్లై ఇచ్చినందుకు క్షమాపణలు కోరింది. ఆ నెంబర్ తనకు ఫాంటసీ నెంబర్ అని కూడా చెప్పింది. మొత్తానికి తన అభిమానిని ఖుషీ చేసింది. ఇక కీర్తి VD18, అక్క, రివాల్వర్ రీటా, సైరెన్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.