- Home
- Entertainment
- బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్ స్టార్‌కి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్? అసలు ప్లాన్ అదేనా?
బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్ స్టార్‌కి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్? అసలు ప్లాన్ అదేనా?
కీర్తిసురేష్ చూడబోతుంటే బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. పూజా, రకుల్, తమన్నా దారిలోనే వెళ్లేలా ఉంది. తాజాగా సూపర్ స్టార్‌తో నటించే ఆఫర్ అందుకుందట.

కీర్తిసురేష్ తెలుగులో మహానటిలా వెలిగిపోయింది. ఆమె ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కి వెళ్లింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అంతే ఈ అమ్మడికి సక్సెస్ దూరమయ్యాయి. `మహానటి` తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది కీర్తిసురేష్. కానీ ఏది వర్కౌట్ కావడం లేదు.
`మహానటి` చిత్రం తర్వాత నేటితరం సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనుకునేలా నటించి మెప్పించింది కీర్తిసురేష్. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ సక్సెస్ దక్కలేదు. `సర్కారు వారి పాట` వంటి కమర్షియల్ చిత్రం చేసింది కానీ సక్సెస్ రాలేదు.
Keerthy Suresh
`దసరా` వంటి రస్టిక్ మూవీతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత కీర్తిసురేష్‌కి తెలుగులో ఆఫర్లు క్యూకడతాయని, బిజీ అవుతుందని భావించారు. మళ్లీ పుంజుకున్నట్టే అని భావించారు. కానీ నో ఆఫర్స్. ఆమె ఒప్పుకోవడం లేదా? సినిమాలు రావడం లేదా తెలియదుగానీ కీర్తికి తెలుగులో సినిమాలు లేకపోవడం గమనార్హం.
Actress Keerthy Suresh
ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది కీర్తిసురేష్. అక్కడ మూడు సినిమాలు చేస్తుంది. `రఘుతాత`, `రివాల్వర్ రీటా`, `కన్నివేడి` వంటి విభిన్నమైన సినిమాలు చేస్తుంది. ఇందులో కొన్నింటిలో తనే మెయిన్ లీడ్ కాగా, మరికొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలుండటం విశేషం.
ఇదిలా ఉంటే కీర్తిసురేష్ బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పటికే కీర్తి వరుణ్ ధావన్‌తో `బేబీ జాన్` చిత్రంలో నటిస్తుంది. ఈమూవీతో నార్త్ కి ఎంట్రీ ఇస్తుంది. అట్లీ కథ అందించిన ఈ మూవీకి కలీస్ దర్శకుడు. చిత్రీకరణలో ఉంది. దీంతోపాటు ఇప్పుడు మరో ఆఫర్ కీర్తిని వరించిందట.
సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో సినిమా చేయబోతుందట. ప్రియదర్శన్‌లో హిందీలో హర్రర్ కామెడీ మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ కీర్తిసురేష్ పేరు వినిపిస్తుంది. ఆమెని మేకర్స్ అప్రోచ్ కాగా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మరోవైపు వీరితోపాటు అలియాభట్, కియారా అద్వానీ పేర్లు కూడా ఉన్నాయి. ముగ్గురిని ఎంపిక చేస్తారా? లేక ముగ్గురిలో ఒకరిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇలా వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వస్తుండటం, కీర్తి సినిమాలు చేస్తుండటంతో ఆమె ఇక ముంబయికి షిఫ్ట్ అవుతుందా? తెలుగు సినిమాలు మానేసి బాలీవుడ్‌కే పరిమితం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే రకుల్, తమన్నా, పూజా హెగ్దే బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. సక్సెస్ కాలేదు. మరి కీర్తి సురేష్.. రష్మికలా దున్నేస్తుందా, లేదంటే మిగిలిన హీరోయిన్లలా డీలా పడుతుందా అనేది చూడాలి.