- Home
- Entertainment
- చేతులు పైకెత్తి హాట్ డోస్ పెంచిన కీర్తిసురేష్.. రచ్చ చేస్తున్న కొత్త ఫోటోలు.. హద్దులు చెరిపేస్తుందిగా!
చేతులు పైకెత్తి హాట్ డోస్ పెంచిన కీర్తిసురేష్.. రచ్చ చేస్తున్న కొత్త ఫోటోలు.. హద్దులు చెరిపేస్తుందిగా!
కీర్తిసురేష్ అంటే ట్రెడిషనల్ లుక్‌కి మారుపేరు. చాలా వరకు ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ ఈ భామ ఇప్పుడు తనలోని హాట్ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. లేటెస్ట్ గా డోస్ పెంచుతూ రెచ్చిపోయింది కీర్తిసురేష్.

`మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్(Keerthy Suresh). ఇందులో అద్భుతమైన నటనతో యావత్ సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ని అలరించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కీర్తిసురేష్ లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో స్లీవ్‌లెస్ బ్లౌజ్, షార్ట్ శారీలో హోయలు పోయింది. చేతులు పైకెత్తి అందాల విందుకి తెరలేపింది. నయగారా నడువొంపులను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కీర్తిసురేష్ ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేయడంతో కుర్రాళ్లకి మతిపోతుంది. ఉన్నట్టుండి ఈ తరహా పోజులతో ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ చేస్తుంది కీర్తిసురేష్.
Keerthy Suresh Hot Photos.
కీర్తిసురేష్ అంటే ట్రెడిషన్ లుక్ కనిపిస్తుంది. మోడ్రన్‌దుస్తులు ధరించినా నిండుగా ఉంటాయి. పైగా కాస్త పద్ధతిగా పోజులిస్తుంటుందీ భామ. కానీ తాజాగా చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోకి గేట్లు ఎత్తేసిందా అనే డౌట్ వస్తుంది. గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. మొత్తంగా కీర్తిసురేష్ నయా గ్లామర్ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయని చెప్పొచ్చు.
Keerthy Suresh Hot Photos.
మలయాళ ముద్దుగుమ్మలు గ్లామర్‌కి దూరంగా ఉంటారు. చాలా వరకు బలమైన పాత్రల్లోనే నటిస్తూ తమ సత్తా చాటుతుంటారు. కనువిందు చేసే రూపంతో అందమంటే స్కిన్‌షో చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తుంటారు. కానీ కెరీర్ పరంగా లాంగ్ రన్ కష్టం. అందుకేనేమో రూట్ మారుస్తున్నారు. అందాల ఆరబోతకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కీర్తిపోజులు చూస్తుంటే అలాంటిదే చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
అయితే తాజాగా కీర్తిసురేష్ పంచుకున్న ఫోటోలు `సర్కారు వారి పాట` చిత్రంలోని `కళావతి` పాటకి సంబంధించినవి. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్. ఈ చిత్రంలోని `కళావతి` అంటూ సాగే పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఈ పాటలో కీర్తిసురేష్ ఈ కాస్ట్యూమ్‌నే ధరించింది. ఆ సమయంలోనే తాను ఫోటోలకు పోజులివ్వగా,వాటిని ఇప్పుడు అభిమానులతో పంచుకుంది కీర్తిసురేష్. `కళావతిగా ఉన్నప్పుడు` అంటూ పోస్ట్ షేర్ చేసింది కీర్తి. కానీ ఇందులో మాత్రం కీర్తి చాలా హాట్‌గా ఉండటం విశేషం. గ్లామర్ డోస్ పెంచి కనిపించడంతో ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
ఇక కీర్తిసురేష్ ఇటీవల మరో సినిమాకి కమిట్ అయ్యింది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కొత్త సినిమాని ప్రారంభించుకుంది. ఇప్పటికే ఆమె తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్` చిత్రం చేస్తుంది. నానితో `దసరా` సినిమాలో నటిస్తుంది. అలాగే మలయాళంలో ఓ సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది కీర్తిసురేష్. Keerthy Suresh Hot Photos.