MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Keerthy Suresh: పెళ్లిపీటలు ఎక్కనున్న కీర్తి సురేష్... కళావతి మెడలో తాళి కట్టే అబ్బాయి ఎవరంటే? 

Keerthy Suresh: పెళ్లిపీటలు ఎక్కనున్న కీర్తి సురేష్... కళావతి మెడలో తాళి కట్టే అబ్బాయి ఎవరంటే? 

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమయ్యారట. ఆమె ఇంటిలో పెళ్లి భాజా మోగనుందట. స్టార్ లేడీ వివాహం ఖాయమే అంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 07 2022, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Keerthy Suresh

Keerthy Suresh

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి మూవీతో జాతీయ అవార్డు సొంతం చేషున్ ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ సిల్వర్ స్క్రీన్ ని ఏలేస్తున్నారు. హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు సంచలనంగా మారాయి.

27
Keerthy Suresh/Instagram

Keerthy Suresh/Instagram


గత రెండు రోజులుగా కీర్తి పెళ్లి పుకార్లు వినిపిస్తున్నాయి. కీర్తి(Keerthy Suresh) పెద్దల నిర్ణయం మేరకు పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక అబ్బాయి ఎవరంటే... ప్రముఖ వ్యాపారవేత్త అట. అతనికి రాజకీయ నేపథ్యం కూడా ఉందట. అన్ని విధాలా కీర్తికి అనువైన వరుడిని పెద్దలు నిశ్చయించగా కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. 

37
Keerthy Suresh

Keerthy Suresh

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్న కీర్తి అప్పుడే పెళ్లి చేసుకుంటారా? అనే సందేహం కూడా కలుగుతుంది. అందులో ఆమె వయసు 29 మాత్రమే. హీరోయిన్స్ విషయంలో ఇది పెళ్ళికి చాలా తక్కువ ఏజ్. ఆఫర్స్ వస్తుంటే 40 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోరు. మరి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

47

కీర్తి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్ కాగా తండ్రి సురేష్ కుమార్ డైరెక్టర్. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి కెరీర్ మొదలైంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం మహానటి. ఒక్కసారి కీర్తి ఇమేజ్ మొత్తం మార్చేసిన ఆ మూవీ పరిశ్రమలో నిలదొక్కునేలా చేసింది. 

57

ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట మూవీతో మంచి కమర్షియల్ హిట్ సొంతం చేసుకుంది. మహేష్ హీరోగా దర్శకుడు పరుశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సర్కారు వారి పాట మూవీలో కీర్తి క్యారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. 

67
Keerthy Suresh

Keerthy Suresh

ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట మూవీతో మంచి కమర్షియల్ హిట్ సొంతం చేసుకుంది. మహేష్ హీరోగా దర్శకుడు పరుశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సర్కారు వారి పాట మూవీలో కీర్తి క్యారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. 
 

77

మరోవైపు బాలీవుడ్ పై కూడా కీర్తి ఫోకస్ పెట్టారు. మంచి ఆఫర్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న కీర్తి బరువు తగ్గారు. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ... నయా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి కీర్తి కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
Recommended image2
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved