- Home
- Entertainment
- Keerthy Suresh: కళావతి ఫోజులకు మైమరచిపోతున్న కుర్రాళ్లు.. హాట్ నెస్ పెంచేసిన కీర్తి సురేష్
Keerthy Suresh: కళావతి ఫోజులకు మైమరచిపోతున్న కుర్రాళ్లు.. హాట్ నెస్ పెంచేసిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.
కీర్తి సురేష్ స్కిన్ షో చేయకుండానే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ కళ్ళు జిగేల్ మనే ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసిపోతోంది. రెడ్ లిప్స్, క్లీవేజ్ అందాలతో ఆమె సెక్సీ గా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు.
కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ఇటీవల 'కళావతి' అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో అందాల దేవతలా ఉంది కీర్తి సురేష్. కీర్తి గ్లామర్, మహేష్ స్టెప్పులు, తమన్ ఆకట్టుకునే సంగీతంతో కళావతి సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనితో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు.
అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి.