కీర్తిసురేష్ మ్యారేజ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా? అఫీషియల్‌గా స్టార్ హీరోయిన్ చెప్పిన విషయాలు ఇవే
మహానటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రూమర్‌గా ఉన్న ఈ విషయాన్ని కీర్తి కన్ఫమ్ చేసింది. పెళ్లి ఎప్పుడు? ఎక్కడో కూడా ప్రకటించింది.
కీర్తి సురేష్ కుటుంబం
సూపర్ స్టార్ రజినీకాంత్ కి హీరోయిన్ గా నటించి పాపులర్ అయిన నటి మేనక, నిర్మాత సురేష్ ల చిన్న కుమార్తె కీర్తి సురేష్. చిన్నతనంలోనే తన తండ్రి నిర్మించిన మలయాళ చిత్రాలలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత 2013 లో మోహన్ లాల్ నటించిన 'గీతాంజలి' చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కీర్తి సురేష్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కీర్తి సురేష్ వివాహం
దీని తర్వాత, దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో విక్రమ్ ప్రభు సరసన 'ఇదు ఎన్న మాయమ్' అనే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టారు. కోలీవుడ్ ఫస్ట్ మూవీ సక్సెస్ కానప్పటికీ మంచి ఆఫర్లు వచ్చాయి. శివ కార్తికేయన్ సరసన నటించిన `రజినీ మురుగన్`, `రెమో` వరుసగా విజయం సాధించాయి.
కీర్తి సురేష్ సినిమాలు
అదేవిధంగా, ధనుష్ సరసన నటించిన 'తోడరి', విజయ్ సరసన నటించిన 'భైరవ' వంటి చిత్రాలు పరాజయం పాలైనప్పటికీ, కీర్తి సురేష్ పై క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక తెలుగులో `నేను శైలజ`తో హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం చేసిన `మహానటి` ఆమెని సౌత్ మొత్తానికి పరిచయం చేసింది. ఈ మూవీకిగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.
తిరుపతిలో కీర్తి సురేష్
తెలుగులో చేసిన `నేను లోకల్` హిట్ కాగా, `అజ్ఞాతవాసి`, `రంగ్ దే`, `మిస్ ఇండియా`, `గుడ్ లక్ సఖీ` పరాజయం చెందాయి. మహేష్‌తో చేసిన `సర్కారు వారి పాట` ఫర్వాలేదనిపించింది. నానితో నటించిన `దసరా` పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ `భోళా శంకర్` బోల్తా కొట్టింది. `కల్కి 2898 ఏడీ`సినిమాకి బుజ్జి పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఆమెకి సినిమాలు లేవు.
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ వివాహం
ఇటీవల 'రఘు తాత' చిత్రం విడుదలైంది. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా', 'కన్నె వెడి' వంటి చిత్రాల్లో నటిస్తోంది. వచ్చే నెల 25న హిందీలో కీర్తి సురేష్ నటించిన 'బేబీ జాన్' చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 32 ఏళ్ళు నిండిన కీర్తి సురేష్ కి వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాల్య స్నేహితుడిని పెళ్లి చేసుకోనున్న కీర్తి
కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ని డిసెంబర్ 11న వివాహం చేసుకోనున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, కీర్తి సురేష్ తరపున ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కీర్తి సురేష్, వచ్చే నెల 11న తన వివాహం జరగనున్నట్లు ధృవీకరించారు. గోవాలో తమ మ్యారేజ్ ఉంటుందని చెప్పింది. ఆంటోనీ తట్టిల్ - కీర్తి సురేష్ ఇద్దరూ స్కూల్ నుంచి స్నేహితులు. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు.
read more: అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు ఇవే
also read: కృష్ణుడిగా నన్ను జనం చూస్తారా? అనుమానంతో ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా? రాజమౌళిని మించిన స్ట్రాటజీ?