- Home
- Entertainment
- మన్మథుడితో రొమాన్స్ ఛాన్స్ కొట్టేసిన `డ్రాగన్` బ్యూటీ.. కయాదు లోహర్ కెరీర్ బిగ్ టర్న్
మన్మథుడితో రొమాన్స్ ఛాన్స్ కొట్టేసిన `డ్రాగన్` బ్యూటీ.. కయాదు లోహర్ కెరీర్ బిగ్ టర్న్
Kayadu Lohar: డ్రాగన్ సినిమాతో ఫేమస్ అయిన కయాదు లోహర్ సింబుతో కలిసి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
simbu,Kayadu Lohar
Kayadu Lohar with Simbu: కోలీవుడ్‌లో తమిళ నటీమణుల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణులే ఎక్కువగా రాణిస్తున్నారు. నయనతార నుంచి జ్యోతిక వరకు చాలా మంది టాప్ హీరోయిన్లు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. ఆ లిస్టులో లేటెస్ట్‌గా చేరిన పేరు కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ నటించిన `డ్రాగన్` సినిమాతో ఈమె హీరోయిన్‌గా పరిచయం అయింది.
Kayadu Lohar
`డ్రాగన్` సినిమా కయాదు లోహర్ కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కయాదుకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె 'హృదయం మురళి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అధర్వకు జోడీగా నటించింది. డాన్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ ఆకాష్ భాస్కరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
Kayadu Lohar
'హృదయం మురళి' తర్వాత కయాదు లోహర్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అదే శింబు సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. 'ఎస్.టి.ఆర్ 49' మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ని అందుకోవడం విశేషం. శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 'పార్కింగ్' మూవీ డైరెక్టర్ రామ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. డాన్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సింబుకు జోడీగా కయాదు లోహర్ నటించనుందట.
STR 49
ముందుగా శింబు సరసన నటించేందుకు సాయి పల్లవితో మాట్లాడారు. ఆమె నో చెప్పడంతో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో కమెడియన్ సంతానం కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో దుబాయ్‌లో స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే కయాదు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. విశ్వక్ సేన్‌తో `ఫంకీ` మూవీలో హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. అంతేకాదు తెలుగులో ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్టు టాక్.
read more: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన స్టార్ హీరో, కట్ చేస్తే మెగాస్టార్ సినిమాల్లోనే సైడ్ రోల్స్