Brahmamudi: స్వప్నకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావ్య.. భార్య మీద ఫైర్ అవుతున్న రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మ ముడి సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. చెయ్యని నేరానికి బలైపోయిన ఒక చెల్లెలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కోర్ట్ కి వెళ్తానంటున్నావు అప్పుడు అత్తింటి పరువు తో పాటు నీ పరువు కూడా పోతుంది, మర్చిపోయావా అని స్వప్నని అడుగుతుంది కావ్య. తొక్కలో పరువు ఎవడికి కావాలి, నాకు నేను సుఖంగా ఉంటే చాలు. ఇన్నాళ్లు నేను కామ్ గా ఉన్నాను కాబట్టే నా గురించి ఎవరికీ తెలియదు నేను ఒకసారి తలుచుకున్నాను అంటే అందరిని తీసి పక్కన పడేస్తాను అంటుంది స్వప్న.
అప్పుడు నీకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తాను, నాకు నా అత్తింటి పరువు కన్నా నువ్వేమీ ఎక్కువ కాదు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు స్వప్న చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు కృష్ణమూర్తి దంపతులు. నా భయం దాని గురించి కాదు, రేపు పొద్దున్న పెద్దాయన పిల్లల జీవితాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టెన్షన్ గా ఉంది అంటాడు కృష్ణమూర్తి.
ఆయన ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోరు ఆడపిల్లల జీవితాల గురించి ఆలోచిస్తారు అంటుంది కనకం. అయినా ఏం ప్రయోజనం చెప్పు స్వప్న అక్కడ ఉన్నన్నాళ్ళు కావ్య సరిగ్గా కాపురం చేసుకోలేదు. ఇప్పుడిప్పుడే అతి కష్టం మీద అందరి మనసులు గెలుచుకుంటుంది, మళ్ళీ స్వప్న దాని స్వార్థం కోసం కావ్యని బలి చేయదని గ్యారెంటీ ఏమిటి. అది అక్కడ ఉన్నన్నాళ్ళు కావ్య జీవితం బాగుపడదు.
ఒక తండ్రిగా ఇలా కోరుకోకూడదు కానీ తను అక్కడ ఉండకపోవడమే మంచిది అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. నిజమే అది అక్కడ ఉంటే కావ్య జీవితం బాగుపడదు ఏదో ఒకటి చేసి దాన్ని అక్కడి నుంచి పంపించాలి అనుకుంటుంది కనకం. మరోవైపు నువ్వు అబద్ధం చెప్తావని మా అత్త చెప్తే నమ్మలేదు, అయినా ముసగేసుకొని పెళ్లి చేసుకున్న నీ నుంచి నిజాయితీని ఆశించడం నాదే తప్పు.
ఇంతమంది నమ్మకాన్ని వమ్ము చేశావు, నిన్ను ఏం చేయాలి అని భార్యని అడుగుతాడు రాజ్. నన్ను చంపేయాలి నాకు బ్రతికే అర్హత లేదు అంటుంది కావ్య. మళ్లీ ఇదో కొత్త నాటకమా అంటాడు రాజ్. నేను నిజం చెప్పినా నమ్మరు నా ప్రేమ అబద్ధం,నా ఉనికి అబద్ధం, నా కాపురం అబద్ధం అయినా నేను ఏమైనా మోసం చేసి మీ ఆస్తులు రాయించుకోవాలనుకున్నానా, నా అక్క చేసిన మోసాన్ని బయట పెడితే నా చేతులతో దాని సంసారం పాడు చేసిన దాన్ని అవుతానని ఆలోచించాను.
అయినా మీరు మాత్రం తాతయ్య విషయంలో ఏం చేశారు, మీరు ఆడింది నాటకం కాదా అని నిలదీస్తుంది కావ్య. నేను ఆడిన నాటకంలో ఇప్పుడిప్పుడే నా మనసు మెత్తబడుతుంది అలాంటి నా మనసుని మళ్లీ రాయి చేసేసావు, ఇకపై ఎన్నటికీ నన్ను నమ్మించాలని, నా ప్రేమను పొందాలని ఆశించలేవు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. బాధగా చూస్తూ ఉండిపోతుంది కావ్య.
మరోవైపు అపర్ణ భర్త తో మాట్లాడుతూ ఇన్నాళ్లు కోడల్ని వెనకేసుకొచ్చారు ఈరోజు తెలిసిందా దాని అసలు బుద్ధి అని నిలదీస్తుంది. సందర్భం వచ్చింది కదా అని మాట విసిరెయ్యకు, తను చేసిన పనిలో నాకు తప్పు కనిపించలేదు. అక్క కాపురం నిలబెట్టడం కోసం చెల్లెలుగా తను ఆ పని చేసింది అంటాడు సుభాష్. అటువంటప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత అయినా మనకి నిజం చెప్పాలి కదా అంటుంది అపర్ణ.
ఆలోచనలో పడతాడు సుభాష్. తరువాయి భాగంలో అపర్ణకి కాఫీ ఇస్తుంది కావ్య. కప్పు నేలకేసి కొట్టి ఇప్పుడు రాజ్ మనసు కూడా విరిగిపోయింది తను కూడా నువ్వు బయటికి వెళ్లిపోతే బాగున్ను అనుకుంటున్నాడు ఇంక నువ్వు మీ అక్క ఇక్కడినుంచి వెళ్తే బాగుంటుంది అంటుంది అపర్ణ. బాధగా కృష్ణుడి దగ్గరికి వెళ్లి తనగోడు వెళ్ళబోసుకుంటుంది కావ్య.