- Home
- Entertainment
- Brahmamudi: నేరాన్ని చెల్లెలి మీదికి నెట్టేసిన స్వప్న.. అక్కకి డెడ్ లైన్ పెట్టిన కావ్య?
Brahmamudi: నేరాన్ని చెల్లెలి మీదికి నెట్టేసిన స్వప్న.. అక్కకి డెడ్ లైన్ పెట్టిన కావ్య?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తన సేఫ్టీ కోసం చెల్లెలి మీద నేరం నెట్టేసిన ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వదిన దగ్గర నుంచి ఉత్తరం లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు కళ్యాణ్. అతనికి దొరక్కుండా తప్పించుకుంటుంది కావ్య. కుటుంబ సభ్యుల ఓటింగ్ అడుగుతాను వాళ్ళు చదవమంటే చదువుతాను అంటూ మరిదిని ఆట పట్టిస్తుంది. కుటుంబ సభ్యులందరూ లెటర్ చదువుమండటంతో దానిని ఓపెన్ చేద్దామనుకుంటుంది కానీ కావ్య దగ్గర నుంచి లెటర్ లాక్కొని వెళ్ళిపోతాడు కళ్యాణ్. తన గదిలోకి వెళ్లి లెటర్ చదువుతాడు.
లెటర్ లో ఎన్నాళ్ళకి కనిపించావు అనే వర్డ్ చదివి అంటే ఈ అమ్మాయికి నేను ముందే తెలుసా.. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచనలో పడతాడు కళ్యాణ్. మరోవైపు డబ్బు తీసుకొని పుట్టింటికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతుంది కావ్య. తను డబ్బు తండ్రికి ఇవ్వటానికి వెళ్తున్నట్లుగా భర్తకి మెసేజ్ పెడుతుంది. నీ డబ్బు నీ ఇష్టం అని ఎప్పుడో చెప్పాను అని రిప్లై ఇస్తాడు రాజ్. హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య.
మరోవైపు డబ్బు కోసం చిట్టీలు వేసే ఆవిడ ఇంటికి అప్పుతో కలిసి వెళుతుంది కనకం. నేను చిట్టి వేస్తాను కానీ మొదటి చిట్టి నేను ఎత్తుకుంటాను అని చెప్తుంది. తినటానికి నీకు కష్టమైపోతుంది అలాంటిది నెలకి 5000 ఎక్కడినుంచి తెచ్చి కడతావు అంటూ కనకాన్ని అవమానించేలాగా మాట్లాడుతుంది ఆవిడ. ఇంతలో ఆమె భర్త వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు.
అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న అప్పు ఈయన ఎవరు అని అడుగుతుంది. మా ఆయన అంటుంది ఆవిడ. మరి మొన్న సినిమా హాల్ కి ఇంకొక ఆయనతో వచ్చావు కదా ఆయన ఎవరు ఆయన ఎందుకు నీకు పువ్వులు కొనిచ్చారు అంటూ ఆ భార్యాభర్తల మధ్య గొడవ పెట్టేస్తుంది అప్పు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే కంగారుపడిన కనకం కూతుర్ని తీసుకుని అక్కడినుంచి వచ్చేస్తుంది. మరోవైపు మెన్సెస్ నొప్పితో బాధపడుతూ ఉంటుంది స్వప్న.
ఎవరితోనైనా తెప్పిస్తే అనుమాన పడతారు అని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది. మందులు డెలివరీ రావడంతో ఎవరికి కనిపించకుండా తీసుకోవాలి అని కంగారుపడుతూ కిందికి వెళ్లి టాబ్లెట్స్ తీసుకుంటుంది. ఇదంతా గమనించిన రుద్రాణి ఏదో తప్పు చేసిందానిలాగా ఎందుకు అంత కంగారుపడుతుంది అనుకుంటుంది. తన గదికి వచ్చిన స్వప్న టాబ్లెట్ వేసుకొని ఆ టాబ్లెట్స్ ని దాచేసి ఏదో పని మీద బయటకు వెళ్తుంది. అప్పుడు రుద్రాణి తన గదిలోకి వెళ్లి ఏం టాబ్లెట్స్ తెప్పించుకుంది అని కబోర్డ్స్ వెతుకుతుంది.
అందులో టాబ్లెట్స్ ని చూసి షాక్ అవుతుంది. అంటే తనకి ప్రెగ్నెన్సీ లేదా ఇప్పుడే నిలదీయాలి అనుకొని బాటిల్ తో సహా బయటికి వస్తుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. ఈ టాబ్లెట్ మెన్సెస్ అయినప్పుడు వాడుతారు ఈ టాబ్లెట్స్ మీ ఆవిడ వాడుతుంది అంటుంది రుద్రాణి. తనకేం అవసరం ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా అంటే తను ఇప్పుడు కడుపుతో లేదా అంటాడు రాహుల్. అప్పుడే స్వప్న తిరిగి తన గదికి వస్తున్న స్వప్నకి అత్తగారి చేతిలో ట్యాబ్లెట్ బాటిల్ కనిపిస్తుంది.
ఆమె దగ్గర కంగారుగా ఆ బాటిల్ లాగేసుకుంటుంది. అప్పుడు రాహుల్, రుద్రాణి ఇద్దరూ నువ్వు ప్రెగ్నెంట్ వి కాదా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావా అంటూ నిలదీస్తారు. కంగారుపడిన స్వప్న ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. సడన్ గా బాటిల్ ఆమె చేతిలో పెట్టి కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి టాబ్లెట్స్ బుక్ చేయమన్నావు కదా వీళ్ళు నాకోసం ఏమో అనుకొని నన్ను నిలదీస్తున్నారు అంటూ నేరాన్ని చెల్లెలు మీదికి నెట్టేస్తుంది స్వప్న.
తరువాయి భాగంలో నీది ఫేక్ ప్రెగ్నెన్సీ అని అందరికీ నీ నోటితోనే చెప్పు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాను ఈ లోపల నిజం చెప్పాలి లేదంటే నేనే చెప్పాల్సి వస్తుంది అని అక్కకి డెడ్ లైన్ పెడుతుంది కావ్య. పుట్టింటికి వెళ్తున్న కావ్యని ఆపి నువ్వు మీ వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికే పుట్టింటికి వెళ్తున్నావ్ కదా అని అందరి ముందు నిలదీస్తుంది అపర్ణ. అవును అంటుంది కావ్య. అందరూ షాక్ అవుతారు.