Brahmamudi: రుద్రాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కావ్య.. తల్లికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఒక కోడలి కష్టసుఖాల కాపురం ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఈ రాజ్ నీకు థాంక్స్ చెప్తున్నాడు అంటాడు రాజ్. ఆశ్చర్య పోతుంది కావ్య. ఎందుకు అంత ఆశ్చర్యం నేను నీకు థాంక్స్ చెప్పినందుకా అంటాడు రాజ్. కాదు థాంక్స్ ని కూడా ఏదో దానం చేసినట్లుగా చేస్తున్నారు కదా అందుకు, అయినా ఈ థ్యాంక్స్ దానానికి గల కారణం ఏమిటి అని వెటకారం గా అడుగుతుంది కావ్య. తాతయ్యకి నిజం చెప్పలేదు కదా అందుకు అంటాడు రాజ్.
అయితే మీరు నాకు చెప్పవలసింది ఇంకొకటి ఉంది, అది సారీ అంటుంది కావ్య. నేను ఎందుకు చెప్పాలి అంటాడు రాజ్. మీ ఫోన్ ముట్టుకున్నందుకు నన్ను తిట్టారు కదా అందుకు అంటుంది కావ్య. ఈ రాజ్ డిక్షనరీలో ఇంకా సారీ చేరలేదు అంటాడు రాజ్. ఆ తర్వాత నిద్దట్లో కావ్య తాతయ్యకి నిజం చెప్పేసినట్లుగా కలకంటాడు రాజ్. ఒకసారిగా ఉలిక్కిపడి లేస్తాడు.
ఇంతలో భార్యని భరించటం కోసం టీవీలో ఆసనం చెప్తూ ఉంటే దానిని ప్రయత్నించి ఆ ఆసనంలో ఇరుక్కుపోతాడు రాజ్. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఆసనం వేస్తుంటే కాళ్లు చేతులు చిక్కుబడిపోయాయి వచ్చి విప్పు అంటాడు రాజ్. అయితే నాకు సారీ చెప్పండి అంటుంది కావ్య. నేను చెప్పను అంటాడు రాజ్. అయితే నేను విప్పను అంటుంది కావ్య.
ఇక తప్పక సారీ చెప్పడంతో రాజ్ ని ఆసనం నుంచి విడిపిస్తుంది. ఆ తర్వాత కావ్య కళ్యాణ్ కోసం కాఫీ పట్టుకు వెళ్తూ ఉంటే రుద్రాణి తనకి కూడా కాఫీ కావాలి అని పొగరుగా అడుగుతుంది. మరిది గారికి కాఫీ పట్టుకు వెళుతున్నాను. నేను వచ్చేసరికి పది నిమిషాలు అవుతుంద. అప్పటివరకు వెయిట్ చేస్తే ఓకే. లేదంటే అన్ని అక్కడే అన్నీ ఉన్నాయి మీరే కాఫీ పెట్టుకోండి అంటుంది కావ్య.
నీకు ఈ మధ్య పొగరు బాగా పెరిగిపోయింది. పుట్టింట్లో మట్టి చిప్పలు చేసుకునే నువ్వు ఇక్కడికి వచ్చి రాజరికం వెలగబెడుతున్నావు. నాలుగు రోజులు నీ మొగుడు నీ చుట్టూ తిరిగేసరికి భూమి మీద నిలవడం లేదు. అయినా నిన్ను భార్యగా కూడా చూడని రాజ్ నీ చుట్టూ తిరుగుతున్నాడంటే వాడికి ఏం మందు పెట్టావో అని పొగరుగా మాట్లాడుతుంది.
నాకు అలాంటి బుద్ధులు లేవు, అయినా భర్తని దారిలోకి తెచ్చుకోవాలంటే ప్రేమ, సహనం ఉంటే సరిపోతుంది. పాపం ఆ చిట్కా తెలియక మీరు ఒంటరిగా మిగిలిపోయినట్లున్నారు అంటూ రుద్రాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది కావ్య.ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది రుద్రాణి. మరోవైపు శాంత అపర్ణ దగ్గరికి కాఫీ ఇవ్వటానికి వెళ్తుంది. తనకి డబ్బులు అవసరం ఉందని అప్పు కావాలని అడుగుతుంది.
అప్పు చేసుకుంటూ పోతే నువ్వే ఇబ్బందుల్లో పడతావు, అయినా ఉన్నంతలో సర్దుకోవడం నేర్చుకో అంటూ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది అపర్ణ. అయితే శాంతిని పక్కకు పిలిచి నువ్వు కావ్యని అడిగి ఉంటే నీ పని అయిపోయేది అంటుంది రుద్రాణి. మరోవైపు కావ్య కళ్యాణ్ కి కాఫీ ఇస్తూ మీ మనోభావాలకి తగ్గట్టుగానే ఉంది మీ అభిమాని అంటుంది కావ్య.
మీరు అనుకుంటున్నట్టు మా మధ్య ఏమీ లేదు వదిన అంటాడు కళ్యాణ్. ఏమీ లేకుండానే మీకు చిన్న దెబ్బ తగిలితే తను పరిగెట్టుకొని వచ్చేసిందా.. ఆడవాళ్లు అంత త్వరగా బయటపడలేరు. మీరే ధైర్యం చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. ఇంతలో అనామిక ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకోమని జాగ్రత్తలు చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత వదిన చెప్పింది నిజమే.
నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు నామీద కేరింగ్ తీసుకుంటుంది. ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయాలి అనుకొని సలహా కోసం అప్పు కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్. సరే అయితే గంటలో నా పని అయిపోతుంది అప్పుడు కలుద్దాం అంటుంది అప్పు. మరోవైపు కిచెన్ లోకి వచ్చిన కావ్యని శాంత డబ్బులు అడుగుతుంది. ఇప్పుడే తెస్తా నుండు అని చెప్పి తన గదికి వెళ్లి భర్తకి విషయం చెప్తుంది.
నువ్వు డబ్బు తీసుకోవడానికి కారణాలు చెప్పొద్దని చెప్పాను కదా, అయినా మన ఇంట్లో పనివాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకోవాల్సింది మనమే వెళ్లి డబ్బులు ఇవ్వు అనటంతో డబ్బులు తీసుకొని వెళుతుంది కావ్య. ఈ లోపు రుద్రాణి అపర్ణ దగ్గరికి వెళ్లి నిన్ను అందరి దగ్గర చెడ్డ చేసి తను మంచి అనిపించుకోవాలని చూస్తుంది నీ కోడలు. నువ్వు డబ్బులు ఇవ్వను అంటే తను డబ్బులు ఇస్తుంది అని అపర్ణని రెచ్చగొడుతుంది.
తరువాయి భాగంలో పనిమనిషికి ఇంటి సొమ్ము దోచిపెడుతున్నావు అంటూ కావ్య మీద కేకలు వేస్తుంది అపర్ణ. నేను కూడా మీలాగే ఈ ఇంటి కోడల్ని అంటుంది కావ్య. నువ్వు,నేను ఒకటేనా నువ్వెంత నీ బతుకెంత అంటూ కావ్య మీద కోపంతో కొట్టడానికి చేయి లేపుతుంది అపర్ణ. ఆ చేతిని పట్టుకుంటాడు రాజ్. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు.