Brahmamudi: రాహుల్ బండారం కావ్య బయటపెట్టనుందా.. అయోమయంలో స్వప్న పరిస్థితి!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన మీద పడ్డ అపవాదుని చెరుపుకోవడానికి నానా తంటాలు పడుతున్న ఒక కొత్త పెళ్లికూతురు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ ని పక్కకి పిలుచుకొని వెళ్తుంది కావ్య. అందరూ ఉంటుండగా అలా పక్కకు రమ్మంటున్నావు అంటే ఏంటి అర్థం అంటూ కోప్పడతాడు రాజ్. ఇంట్లో ఎవరూ వినకూడదని అర్థం మా అక్క తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం పదండి వెళ్దాము అంటుంది కావ్య.
ఒక్కసారి గా షాక్ అయిన రాజ్ పూజ మధ్యలో వెళ్తే బాగోదేమో అంటాడు రాజ్. ఇకనుంచి వెళ్ళటానికి కరెక్ట్ టైం కాదు కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఇదే కరెక్ట్ టైం నిజం తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే రండి లేదు అంటే లైఫ్ లాంగ్ నేను మీతోనే ఉండిపోవాల్సి వస్తుంది అంటుంది కావ్య. వీల్లేదు నిజం ఎట్టి పరిస్థితుల్లోని తెలుసుకొని తీరాలి అని అక్కడ నుంచి బయలుదేరుతారు రాజ్ దంపతులు.
మరోవైపు కావ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పు, కళ్యాణ్. వాళ్లకి కరెక్ట్ అడ్రస్ చెప్పావా అంటాడు కళ్యాణ్. కరెక్ట్ అడ్రసే చెప్పాను కానీ మనం ఇక్కడ ఉండొద్దు అంటుంది అప్పు. ఎందుకు అని అడుగుతాడు కళ్యాణ్. ఇక్కడ మీ అన్నయ్య మనల్ని చూస్తే మనమే ఏదో ప్లాన్ చేసాం అనుకుంటాడు అందుకే పక్కకు పోయి నిల్చుందాం అనటంతో ఇద్దరూ పక్కకి వెళ్ళిపోతారు.
మరోవైపు ఈ టైంలో ఎందుకు పిలిచావు అంటూ కోపంగా అడుగుతాడు రాహుల్. ఇంత అందంగా నీకోసం రెడీ అయి వస్తే అలా కసురుకుంటావేంటి నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటుంది స్వప్న. ఏదో టెన్షన్ లో ఉండి అలా అన్నాను కానీ ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంటూ ఓవరాక్షన్ చేస్తాడు రాహుల్. మరోవైపు గుళ్లో రాజ్ కావ్య కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు.
ఇంకా నయమే ఇద్దరూ వెళ్లారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ దుగ్గిరాల అపర్ణ అగ్గి మీద గుగ్గిలం అయిపోయేది అని మనసులో అనుకుంటుంది కనకం. మరోవైపు రాజ్ ని పార్కులోకి తీసుకువస్తుంది కావ్య. వాళ్ళిద్దర్నీ రాహుల్ స్వప్న ఇద్దరు చూసేస్తారు. కంగారు పడిపోయిన స్వప్న నిజం చెప్పేద్దాం అంటుంది. వద్దు నువ్వు పారిపో అంటాడు రాహుల్. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే రాజ్ కీ వాళ్ళిద్దర్నీ చూపిస్తుంది కావ్య.
అక్కడ రాహుల్ చూసి ఒక్కసారి గా షాక్ అవుతాడు రాజ్. స్వప్న అక్కడ నుంచి పారిపోతుంటే కావ్య పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమెని తోసేసి మరీ పారిపోతుంది స్వప్న. స్వప్న పారిపోవడం.అప్పు వాళ్ళు చూస్తారు. వస్తే ఇద్దరూ రావాలి కానీ ఒక్కర్తే ఎందుకు వస్తుంది అని అనుమాన పడుతుంది అప్పు. బయట నిలబడి ఆలోచించడం ఎందుకు లోపలికి వెళ్దాం పద అంటాడు కళ్యాణ్.
వద్దని ముందే చెప్పాను కదా అంటుంది అప్పు. స్వప్న పారిపోతే రాహుల్ ఏది చెప్తే అదే నిజం అవుతుంది అప్పుడు మా రాజ్ అన్నయ్య ఎలా నమ్ముతాడు అందుకని వెళ్లి చూద్దాం అని కళ్యాణ్ అనడంతో సరే అప్పు సరే అని ఇద్దరూ మళ్లీ పార్కులోకి వస్తారు. షాక్ లో ఉన్న భర్తని ఎన్నాళ్ళు నన్ను నమ్మలేకపోయారు ఇప్పుడు చూసిన నిజాన్ని నమ్మలేకపోతున్నారు కానీ ఇది నిజం అంటుంది కావ్య.
మా అక్క వెనుక ఉన్నది మీ ఇంట్లో మనిషే అని అర్థం చేసుకోండి. ఇది నిజం నాకు ఎప్పుడో తెలుసు కానీ మీరు నమ్మాలంటే సాక్ష్యం కావాలి అందుకే ఇన్నాళ్లు ఆగాను అంటుంది కావ్య. మరోవైపు ఆటోలో వెళ్ళిపోతూ అనవసరంగా రాహుల్ మాట విని వెనక్కి వచ్చేస్తున్నాను అక్కడే ఉండి జరిగిందంతా చెప్పేయాల్సింది అయినా రాజ్ వాళ్ళు పూజ మధ్యలో నుంచి ఎందుకు వచ్చారు అంటూ అయోమయంలో పడుతుంది స్వప్న.
మరోవైపు మీరిద్దరూ ఇలా వచ్చారేంటి పదండి పూజ దగ్గరికి వెళ్దాము అంటూ రాజ్ చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు రాహుల్. చేయి వదిలించుకుని రాహుల్ చెంప పగలగొడతాడు రాజ్. తరువాయి భాగంలో నాతోనే సవాల్ విసిరావు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావు అంటుంది కావ్య. కావ్యని నోరుముయ్యమంటాడు రాహుల్. నువ్వు నోరు ముయ్యి తనకి ఇప్పుడు ఏమైనా అనే హక్కు ఉంది ఇప్పుడు తను నా భార్య అంటాడు రాజ్. ఆ మాటలకి సంతోషిస్తుంది కావ్య. వాళ్లు అనుకున్నది సాధించినందుకు ఆనందపడతారు అప్పు, కళ్యాణ్.