Brahmamudi: అత్త మాటలకు అవాక్కైన అపర్ణ.. నిజాన్ని పసిగట్టిన కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. జరిగిన పొరపాటు వెనకాల భార్య హస్తం ఉందని అనుమానిస్తున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను పుట్టి పెరిగిన ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంతకన్నా మీరు మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు అంటుంది కావ్య. స్వప్న ఎక్కడ దొరికిపోతుందో అని ఇలా నాటకం ఆడుతుంది నేను మాత్రం తక్కువ ఎలా అయినా స్వప్నని పట్టుకొని నిజం రప్పించాలి అనుకుంటాడు రాజ్. తన ఇంటికి రమ్మని నేను తననే బ్రతిమాలాలా అనుకుంటూ వెళ్లిపోదాం అంటే పద వెళ్ళిపోదాం అంటూ గట్టిగా ఇంట్లో వాళ్ళు వినేలాగా అరుస్తాడు రాజ్.ఆ కేకలకి బయటికి వచ్చిన అప్పు, కావ్య వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. ప్లాన్ వర్క్ అవుట్ అయింది అనుకుంటాడు రాజ్. కావ్య ని చూసిన కనకం ఎమోషనల్ అవుతూ ఆమెని గట్టిగా హత్తుకుంటుంది.
వీధిలో అందరినీ పిలిచి హడావుడి చేస్తుంది. వీధిలో వాళ్ళందరూ అక్కడ చేరి అమ్మాయి అదృష్టవంతురాలని కొందరు, అబ్బాయి అదృష్టవంతుడు అని కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. కనకం హారతి ఇచ్చి దంపతులిద్దరిని లోపలికి తీసుకొస్తుంది. వీధిలో వాళ్ళందరూ పేర్లు చెప్పి లోపలికి వెళ్ళండి అంటూ హడావిడి చేస్తారు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు రాజ్. ఎందుకు కోప్పడతారు మా కావ్యమ్మకి మొగుడు అంటే ఈ వీధి అంతటికి అల్లుడే అంటూ పేరు చెప్పనిదే లోపలికి వెళ్ళనివ్వం అంటూ అందరూ గొడవ చేస్తారు.
తప్పదు అనుకున్న రాజ్ ముందు మీ అమ్మాయిని చెప్పమనండి అంటాడు. కావ్య తన భర్త పేరు చెప్తుంది. కానీ రాజ్ మాత్రం ఆమె పేరు తెలియక కళావతి అని చెప్తాడు. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మా అల్లుడు గారికి భార్య పేరు కావ్య అని తెలుసు కానీ ఆమె కళకి విలువ ఇచ్చి ముద్దుగా కళావతి అని పిలుచుకుంటారు అంటూ అందరికీ చెప్పి కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటుంది కనకం. చూసింది చాలు ఇంక పొండి అంటూ వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తుంది అప్పు. మరోవైపు తండ్రిని చూసిన కావ్య కన్నీరు పెట్టుకుంటూ అతన్ని హత్తుకుంటుంది కావ్య.
అది చూసి కృష్ణమూర్తి వాళ్లు కూడా కన్నీరు పెట్టుకుంటారు. అల్లుడికి నమస్కారం పెట్టి మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావటమే గొప్ప అంటూ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తాడు కృష్ణమూర్తి. అల్లుడ్ని లోపలికి తీసుకువెళ్ళు భోజనం సిద్ధం అవ్వగానే పిలుస్తాను అంటూ కావ్యకి చెప్తుంది కనకం. గదిలోకి వచ్చిన రాజ్ అతిధి మర్యాదలతో అలసిపోయాను కాసేపు రిలాక్స్ అవుతాను అంటూ మంచం మీద పడుకుంటాడు. పరుపు గట్టిగా తగలడంతో పరుపు కింద బంగాళదుంపలు దాచారా మీ దుంపలు తెగ అంటూ లేచి కూర్చుంటాడు.
కాదు అది పరుపే చాలా కాలం అయింది కదా అందుకే ఉండలు కట్టినట్లుగా ఉంది అంటుంది కావ్య. అక్కడే ఉన్న ఒక బొమ్మని చేత్తో పట్టుకుంటాడు రాజ్. అన్ని క్లీన్ చేసి ఈ బొమ్మని క్లీన్ చేయనట్లుగా ఉంది అనుకుంటూ బొమ్మ మీద ఊదుతుంది కావ్య. దుమ్ము లేచి రాజ్ తుమ్ములతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. కోపంతో బొమ్మని నేలకేసి కొట్టబోతే బొమ్మని లాక్కొని క్లీన్ చేసి పెడుతుంది కావ్య. పచ్చి అబద్దాలని నమ్మి బొందలో పడ్డాను నాకన్నా పెద్ద పెద్దమ్మ ఎవడూ ఉండడు అంటాడు రాజ్. బయటికి వెళ్ళిపోతున్న కావ్యని ఉక్కపెడుతుంది ఫ్యాన్ వేసి వెళ్ళు అంటాడు.
కావ్య ఫ్యాన్ వేయడంతో పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అంటే కంగారు పడతాడు రాజ్. ఫ్యాన్ వైపు చూపిస్తుంది కావ్య. క్రషర్ మిషన్ లో నుంచి సౌండ్ వచ్చినట్లుగా సౌండ్ వస్తుంది అంటూ తల కొట్టుకుంటాడు రాజ్.అప్పు పుట్టినప్పటి ఫ్యాన్ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. అయినా నేను వచ్చింది స్వప్నని వెతకడానికి కదా ముందు ఆ పని చేయాలి అనుకుంటాడు రాజ్. మరోవైపు ఇంటికి వెళ్లడం తప్ప వేరే దారి కనిపించడం లేదు అనుకుంటుంది స్వప్న. మరోవైపు పెట్టే సర్దుకొని బయటికి వచ్చిన అపర్ణ మామగారి కాళ్ళకి దండం పెడుతుంది. ఆమెని అలా చూసి అందరూ షాకవుతారు.
నా ఇంట్లోనే నా ఆత్మగౌరవం దెబ్బతింది నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అంటుంది అపర్ణ. ఈ ఇల్లు నీ ఇల్లు ఎందుకు అవుతుంది అంటుంది చిట్టి. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టాడు కాబట్టి అంటుంది అపర్ణ. మరి నీ కొడుకు కూడా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు ఆ అమ్మాయి ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎన్నిసార్లు దెబ్బతీయలేదు అంటూ నిలదీస్తుంది చిట్టి.
తరువాయి భాగంలో దొరికిందా అంటూ భర్తని అడుగుతుంది చిట్టి. ఏంటి అని అడుగుతాడు రాజ్. నామీద అప నమ్మకంతో మీరు వెతుకుతున్నారే మా అక్క ఆమె దొరికిందా అని అడుగుతుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్. మా అక్క ఇక్కడ లేదు అని కావ్య అంటే నీ అబద్దం నిజమో నా నమ్మకం నిజమో ఇప్పుడే తేలుస్తాను అంటూ ఇంటి చుట్టూ వెతుకుతుంటాడు రాజ్.