Brahmamudi: ధాన్యలక్ష్మికి తల తిరిగిపోయే సమాధానం చెప్పిన స్వప్న.. భర్త మాటలకు కన్నీరు పెట్టుకున్న కావ్య?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. మోడలింగ్ మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నా ఒక మూర్ఖురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు ఇలా చేశావు నీ కళ ని నేను గుర్తించనుకున్నావా అని భార్యని నిలదీస్తాడు రాజ్. అవును ఆ రోజు నేను ఆఫీసులో డిజైన్స్ గీసి మీకు ఇచ్చినప్పుడు ఇంటి ముందు వేసుకునే ముగ్గులనుకున్నావా అని కనీసం చూడకుండా చించిపడేశారు అదే డిజైన్స్ శృతి చూపిస్తే మెచ్చుకున్నారు.
మీ దృష్టిలో మీ భార్య ముగ్గులు వేయడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదు అని నిష్టూరంగా చెప్తుంది కావ్య. నీ కళ్ళని గుర్తించని రసహీనులు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి కావ్యకి డబ్బులు ఇస్తాడు రాజ్. ఎందుకు అని అడుగుతుంది కావ్య. నీ కష్టానికి ప్రతిఫలం అంటాడు రాజ్. రాజ్ దగ్గర డబ్బులు తీసుకుని ఈ డబ్బులు నా కోసం కాదు అని చెప్తుంది. నాకు చెప్పవలసిన అవసరం లేదు నీ కష్టము నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్.
భర్త ప్రవర్తనకి ఆనందపడుతుంది కావ్య. పొద్దు పొద్దున్నే భర్తకి బెడ్ కాఫీ దగ్గర నుంచి డ్రెస్ సెలక్షన్ వరకు అన్ని అమర్చి పెడుతుంది. నిద్రలేస్తూనే అవన్నీ చూసిన రాజ్ ఏంటి కళావతిలో వింత మార్పు అనుకుంటాడు కానీ తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోడు. అది చూసిన కావ్య డిసప్పాయింట్ అవుతుంది. భర్త ఆఫీస్ కి వెళ్ళబోతుంటే ఆపి చిట్టిని, అపర్ణని రాజ్ ని పుట్టింటికి వెళ్తాను అని పర్మిషన్ అడుగుతుంది. చిట్టి పర్మిషన్ ఇస్తుంది కానీ అపర్ణ ఒక పట్టాన ఒప్పుకోదు.
కావ్య ని సపోర్ట్ చేస్తూ పంపిద్దాం మమ్మీ అని అడుగుతాడు రాజ్. అపర్ణకి ఒప్పుకోక తప్పదు. కావ్య అందరికీ థాంక్స్ చెప్పి సాయంత్రం కల్లా వచ్చేస్తాను అని సంతోషం గా చెప్తుంది. మరోవైపు అల్ట్రా మోడ్రన్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది స్వప్న. అది చూసిన రాహుల్ షాక్ అవుతాడు ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తే మా ఇంట్లో వాళ్లకి గుండె ఆగిపోతుంది అంటాడు. ఒక్క యాడ్ లో యాక్ట్ చేసి నలుగురు నా గురించి గొప్పగా మాట్లాడుకుంటే అప్పుడు వాళ్లే నన్ను మెచ్చుకుంటారు అంటుంది స్వప్న.
అది సరేగాని ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను చెప్పు అని భర్తని అడుగుతుంది స్వప్న. తెలుగులో పదివేల పదాలు ఉన్న ఒక్క మాట కూడా రావడం లేదు అంత బాగున్నావు అంటాడు రాహుల్. మరోవైపు బయట వెయిట్ చేస్తున్న కావ్య దగ్గర కారు ఆపుతాడు రాజ్. ఎక్కుతుందేమో అని రాజ్ పిలుస్తాడేమో అని కావ్య ఇద్దరు కాసేపు మౌనంగా ఉంటారు. కానీ ముందుగా రాజే కారెక్కితే డ్రాప్ చేస్తాను అని అంటాడు. మీరు డ్రాప్ చేస్తానంటే ఎందుకు ఎక్కను అని కారులో కూర్చుంటుంది కావ్య.
ఆనందపడిపోతున్న కావ్యని చూసి నేనేమీ నిన్ను అమెరికా తీసుకెళ్లడం లేదు అంటాడు రాజ్. పెళ్లయిన ఆడపిల్లకి పుట్టిల్లు అమెరికా కన్నా ఎక్కువ అంటుంది కావ్య. మరోవైపు మోడ్రన్ డ్రెస్ లో కిందికి దిగిన స్వప్నను చూసి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్తే ఇంటి పరువు ఏం అవ్వాలి అని మందలిస్తుంది. మీ చాదస్తాలని పక్కన పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే మీరు మానేయండి.
ఒంటి మీద కేజీలు కేజీలు బంగారం వేసుకోవడం జన్మహక్కు అన్నట్టు భావిస్తారు. మీరు ఇలా ఉండబట్టే కళ్యాణ్ కూడా అలా తయారయ్యాడు. రేపు వచ్చే మీ కోడలు మీద కూడా ఇలాంటి ఆంక్షలు విధిస్తే వెంటనే ఇల్లు వదిలి పారిపోతుంది. నీకు ఇష్టం లేకపోతే పోయి ఒక మూలన కూర్చుండి అని సమాధానం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది స్వప్న.
ఆమె సమాధానానికి తల తిరిగిపోతుంది ధాన్యలక్ష్మి. ఇదంతా చూస్తూ ఉంటారు రాహుల్, రుద్రాణి. స్వప్న ధాన్యలక్ష్మిని ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేసింది. ఇకమీదట కథ నేను నడిపిస్తాను అని కిందికి దిగుతుంది రుద్రాణి. మరోవైపు కారులో వెళ్తున్న రాజ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పువ్వులు అమ్మే ఆవిడ వెటకారంగా మాట్లాడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పువ్వులు కొని భార్యకి ఇస్తాడు.
వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కారు ఆగుతుంది. కార్ ఎందుకు ఆపారు అంటుంది కావ్య. మీ ఇల్లు వచ్చింది అంటాడు రాజ్. తరువాయి భాగంలో మీ ఇద్దరి మధ్యన తొలిప్రేమ పుడుతుందా అని కొడుకుని అడుగుతుంది అపర్ణ. అలాంటిదేమీ లేదు తను నాకు సాయం చేస్తుంది నేను తన సాయం చేస్తున్నాను తను ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్తాడు రాజ్. అనుకోకుండా ఆ మాటలు విన్న కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.