Brahmamudi: రాహుల్ ఛాలెంజ్ ను ఒప్పుకున్న కావ్య.. రాజ్ ని నిలదీసిన ధాన్యలక్ష్మి!
Brahmamudi: జీ తెలుగులో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తనని అపార్థం చేసుకుంటున్న భర్తకి నిజం నిరూపించడం కోసం తపన పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అతని మాటలు నమ్మకండి అతను మిమ్మల్ని మానిప్లేట్ చేయటానికి చూస్తున్నాడు అంటుంది కావ్య. అతని మాటల్లో కూడా నాకు నిజం కనిపిస్తుంది అతను అన్నట్లుగా స్వప్న ఎందుకు పారిపోయింది రాహుల్ ఎందుకు పారిపోలేదు అంటాడు రాజ్. నాకు ఎందుకు ఈ అక్క చెల్లెలు ఇద్దరు కలిపే ఈ నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది అంటాడు రాహుల్.
ఈ కళావతి వచ్చిన దగ్గరనుంచి నేను నానా మాటలు అన్నాను అయినా తను ఎప్పుడు నాకు ఎదురు చెప్పలేదు అలాంటిది ఈరోజు సాంప్రదాయబద్ధమైన పూజ నుంచి తీసుకువచ్చింది అంటే అందుకు బలమైన కారణం ఉంది. ముందు నుంచి నిజం నిరూపిస్తాను అంటూనే ఉంది. అందుకే తనకి ఒక అవకాశం ఇస్తున్నాను. మీ అక్కది ఏ తప్పు లేదని నిరూపించు అని కావ్యకి చెప్పాడు రాజ్.
మళ్లీ తనకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు అంటాడు రాహుల్. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నీ తప్పు లేనప్పుడు నీకు ఎందుకు భయం ఒకవేళ తప్పు నీది అని తేలితే మాత్రం నాలో ఇంకొక మనిషిని చూస్తావు లేదంటే కళావతికి పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది అంటూ కావ్యని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్.
ఈసారి గేమ్ చాలా బాగా ఆడావు కానీ ఇకమీదట నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అని మనసులో అనుకుంటాడు రాహుల్. ఆ తర్వాత మండపం దగ్గరికి వచ్చిన కావ్య దంపతులను పూజా ప్రారంభించిందే మీకోసం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేమిటి అంటూ మందలిస్తాడు సుభాష్. నిజం రుజువు కాకుండా రాహుల్ ని ఇరికించకూడదు అనుకొని నేనే కవిని బయటకు తీసుకుని వెళ్లాను అని చెప్తాడు.
ఆ మాటలకి షాక్ అవుతుంది అపర్ణ. విన్నావా నీ కొడుకు మాటలు అంటూ కోడల్ని మందలిస్తుంది చిట్టి. ఈలోగా పంతులుగారు దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా రండి అనటంతో పీటల మీద కూర్చొని పూజ పూర్తి చేస్తారు కావ్య, రాజ్. ఆ తర్వాత పనిచేసుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చి రాహుల్ వాళ్ళని మనం చూసినట్లుగా ఇంట్లో చెప్పొద్దు అంటాడు రాజ్.
అంటే అతను తప్పు చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నారా లేకపోతే మీకెందుకు అంత భయం అంటూ నిలదీస్తుంది కావ్య. రాహుల్ చిన్నప్పటి నుంచి నాతో పెరిగాడు వాడు అస్సలు తప్పు చేయడు కానీ నిజాలు తెలియకుండా ఎందుకు అందర్నీ బాధ పెట్టడం ముందు రాహుల్ తప్పు చేశాడని నిరూపించు అప్పుడు చూద్దాం అంటాడు రాజ్. చిన్నప్పటినుంచి మీతో పెరిగిన వ్యక్తి తప్పు చేశాడు అంటే మీరు డైజస్ట్ చేసుకోలేకపోతున్నారు.
కచ్చితంగా రాహుల్ ది తప్పని నిరూపిస్తాను అంటూ సవాలు చేస్తుంది కావ్య. మరోవైపు అప్పు, స్వప్న ఇంట్లో లేకపోవడంతో కంగారు పడతారు కనకం దంపతులు. ఆడపిల్లలు అని ముద్దుగా పెంచితే నెత్తికెక్కుతున్నారు అంటూ కోప్పడతాడు కృష్ణమూర్తి. అప్పుడే వచ్చిన స్వప్నని ఎక్కడికి వెళ్లావు వద్దని చెప్పినా వినిపించుకోవా అంటూ మందలిస్తుంది కనకం.
అంతలోనే అప్పు కూడా వస్తుంది. తను ఏమీ అనట్లేదు కానీ నాకెందుకు ఆంక్షలు విధిస్తున్నారు అంటూ నిలదీస్తుంది స్వప్న. నువ్వు ఆ అర్హతని పోగొట్టుకున్నావు నేను మంచి సంబంధం చూశాను త్వరలోనే నీకు పెళ్లి అంటాడు కృష్ణమూర్తి. మీరు ఏ సంబంధం చూసిన నేను చేసుకోను ఈ విషయంలో మీరు ఎంత మొండికేస్తే నేను అంతకన్నా ఎక్కువ మొండికేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
దీని వరుస చూస్తే మళ్ళీ ఏదో కొంప మీదకి తెచ్చేలాగా ఉంది అంటుంది కనకం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తెచ్చిన సంబంధం చేయడం ఖాయం అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు రాహుల్ కావ్య వాదించుకుంటూ ఉంటారు. నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా కూడా నువ్వు ఏమి చేయలేకపోయావు అంటాడు రాహుల్. మా ఆయన మనసులో అనుమానమనే బీజాన్ని నాటాను త్వరలోనే నిజాన్ని కూడా నిరూపిస్తాను అంటుంది కావ్య. నీ అక్కనే నీ మీదకి ఆయుధం లాగా వాడబోతున్నాను రెడీగా ఉండు రాహుల్.
రెడీ అంటూ అతనితో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. తరువాయి భాగంలో పనిచేసుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నావు నిజాన్ని త్వరగా నిరూపించు. లేదంటే అని రాజ్ అనే లోపుగా లేదంటే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారని నాకు తెలుసు అంటుంది కావ్య. అనుకోకుండా ఈ మాటలు విన్న ధాన్యలక్ష్మి నిర్గంత పోతుంది. ఆ తర్వాత అదే విషయాన్ని రాజ్ ని అడుగుతుంది. నిర్గాంతపోతాడు రాజ్.